Home /News /andhra-pradesh /

MAN DIES AFTER ELECTRIC BIKE BATTERY EXPLODES IN HOUSE WIFE AND CHILDREN INJURED INCIDENT AT ANDHRA VIJAYAWADA MKS

Vijayawada: షాకింగ్ న్యూస్: ఎలక్ట్రికల్‌ బైక్‌ బ్యాటరీ పేలి వ్యక్తి మృతి, భార్యాపిల్లలకు తీవ్ర గాయాలు

విజయవాడలో ఎలక్ట్రికల్‌ బైక్‌ బ్యాటరీ పేలుడు

విజయవాడలో ఎలక్ట్రికల్‌ బైక్‌ బ్యాటరీ పేలుడు

ఎలక్ట్రికల్‌ బైక్‌ లకు సంబంధించి మరో షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో చోటుచేసుకుంది. ఎలక్ట్రికల్‌ బైక్‌ బ్యాటరీ పేలిపోయి ఓ వ్యక్తి మరణించగా, అతని భార్యా, పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రభుత్వాలు సైతం పనికట్టుకొని ప్రచారాలు చేస్తుండటం వల్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడి జనం ఎడాపెడా ఎలక్ట్రికల్‌ బైకులు కొంటున్న క్రమంలో వరుసగా భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటం కలవరపెడుతున్నది. ఎలక్ట్రికల్‌ బైక్‌ లకు సంబంధించి మరో షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో చోటుచేసుకుంది. ఎలక్ట్రికల్‌ బైక్‌ బ్యాటరీ పేలిపోయి ఓ వ్యక్తి మరణించగా, అతని భార్యా, పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలివే..

విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం గులాబీ తోటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి శుక్రవారం నాడు సరికొత్త కొత్త CORBETT14 మోడల్ ఎలక్ట్రానిక్ బైక్‌ను కొనుగోలు చేశాడు. కొత్త బైక్ కొన్న ఆనందంలో ఇంట్లోవారంతా సంతోషంగా గడిపారు. ఎలక్ట్రిక్ బైక్‌కు వచ్చిన బ్యాటరీకి బెడ్ రూమ్ లో చార్జింగ్ పెట్టి, కుటుంమంతా మంచాలపై నిద్రించింది..

Hyderabad: అక్షింతలు వేస్తానంటూ అంతం చేసి.. ఆలయంలోనే శవాన్ని దాచి.. మల్కాజ్‌గిరి ఘటనలో షాకింగ్ నిజాలివే



ప్రమాదం జరిగిన ఇంట్లో దృశ్యం


శనివారం తెల్లవారుజామున తెల్లవారుజామున ఒక్కసారిగా ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలిపోయి గదిలో మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే మంటలు ఇల్లుమొత్తాన్ని చూట్టేశాయి. శివ కుమార్‌తో పాటు భార్య, ఇద్దరూ పిల్లలు మంటల్లో చిక్కుకుపోయారు. పెద్ద ఎత్తున మంటలు, పొగ రావడంతో చుట్టు పక్కల వారు చూసి తలుపులు పగలగొట్టి ఇంట్లో వారిని బయటకు తీసుకువచ్చారు. కానీ

పడక సుఖానికి దూరమైన భార్యకు కడుపు చేసిరాపో: జీవిత ఖైదీకి 15 రోజుల పెరోల్.. హైకోర్టు అరుదైన తీర్పు


పొరుగువారు సహాయం అందించే సమయానికే శివకుమార్ తోపాటు మిగతా ముగ్గురికీ కాలిన గాయాలయ్యాయి. దీంతో వారిని 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. కాగా, దారి మధ్యలోనే శివ కుమార్ ప్రాణాలు విడిచాడు. అతని భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. పిల్లలను మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Bhadrachalam : ఎట్టకేలకు భద్రాచలానికి రైలు.. గోదావరిపై భారీ వంతెన.. ప్రారంభం ఎప్పుడంటే..


దేశంలో ఎలక్ట్రికల్‌ బైకులు పేలిపోతోన్న సంఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో బ్రాండెడ్ ఎలక్ట్రికల్‌ బైకులు సైతం తగులబడిపోతున్న దృశ్యాలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. ఏపీలో ల్యాప్ టాప్ పేలిపోయి ఓ యువతి చనిపోయిన ఘటన మరువకముందే ఇవాళ విజయవాడలో ఎలక్ట్రికల్‌ బైక్‌ బ్యాటరీ పేలి కుటుంబం విషాదం బారినపడటం గమనార్హం.
Published by:Madhu Kota
First published:

Tags: Andhra Pradesh, Electric bike, Vijayawada

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు