పాల ప్యాకెట్లు కొనుక్కొని ఇంటికి వెళ్తూ... మృత్యు ఒడిలోకి...

Andhra Pradesh : నడిరోడ్డుపై జరిగిన ఆ ఘటన... అందర్నీ కలచివేసింది. ఏమైందో తెలుసుకొని... ప్రతి ఒక్కరూ... అయ్యో అంటూ విచారం వ్యక్తం చేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 21, 2019, 12:45 PM IST
పాల ప్యాకెట్లు కొనుక్కొని ఇంటికి వెళ్తూ... మృత్యు ఒడిలోకి...
రోడ్డు ప్రమాదంలో విషాదం
Krishna Kumar N | news18-telugu
Updated: August 21, 2019, 12:45 PM IST
కృష్ణా జిల్లా... మచిలీపట్నం... వలందపాలెంలో జరిగిందీ విషాదం. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దాంతో... బైక్‌పై నుంచీ ఆయన... ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో... అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. బైక్ ముందు భాగం నుజ్జైంది. ప్రమాదాన్ని కళ్లారా చూసిన స్థానికులు పరుగున అక్కడికి వచ్చారు. చనిపోయింది పైడేశ్వరరావు అని గుర్తించారు. వెంటనే అతని కుటుంబానికి కాల్ చేసి విషయం చెప్పారు. మాచవరం మెట్టు దగ్గర పైడేశ్వరరావు ఇల్లు ఉంది. తన పిల్లల్ని స్కూల్‌కి పంపేందుకు రోజూ లాగే... పాల ప్యాకెట్లు, టిఫిన్ తీసుకొని... ఇంటికి బయల్దేరాడు. స్కూల్‌కి టైమ్ అయిపోతోందన్న హడావుడిలో... కాస్త వేగంగానే బైక్ నడిపాడు. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు... బలంగా ఢీకొట్టడంతో... తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. నాన్న కోసం ఎదురుచూసిన ఆ పిల్లలకు కన్నీరే మీగిలింది. కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పాల ప్యాకెట్ల కోసం వెళ్లి... ప్రాణాలు కోల్పోయాడంటూ స్థానికులు విచారం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నా్రు.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...