భార్యతో వ్యభిచారం చేయించు.. వడ్డీ వ్యాపారుల దాష్టీకం... వ్యక్తి ఆత్మహత్య

భార్యతో వ్యభిచారం చేయించు.. వడ్డీ వ్యాపారుల దాష్టీకం... వ్యక్తి ఆత్మహత్య

ప్రతీకాత్మక చిత్రం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి సెల్ఫీ తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

 • Share this:
  వడ్డీ వ్యాపారుల దాష్టీకం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆవేదన మొత్తం ఓ సెల్ఫీ తీసి అనంతరం ప్రాణాలు తీసుకున్నాడు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి సెల్ఫీ తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు. శ్రీకాళహస్తి డీఎస్పీ, సీఐ, ఎస్సై లకు సెల్ఫీ వీడియో ద్వారా మరణ వాంగ్మూలం అందించాడు. డబ్బుల కోసం మానసికంగానూ, భౌతిక దాడికి అప్పులు ఇచ్చిన వారు దిగడంతో తీవ్ర మనస్తాపానికి గుర్తెయనని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. భార్యతో వ్యభిచారం చేయించైనా తమ అప్పు తీర్చాలని వడ్డీ వ్యాపారి దూషించడంతో తాను కుంగిపోయిన ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు తెలిపాడు.

  ‘డీఎస్పీ, ఎస్‌ఐ సార్‌కి నమస్కారం. కరోనా రాకముందు ఒక్క నెల కూడా ఆపలేదు. కరోనా వచ్చాక కట్టలేకపోయాను. అసలు, రెండు నెలల వడ్డీ ఇచ్చెయ్యంటున్నారు. నేను నెలకి రూ.6500 వడ్డీ కడుతున్నాను. లక్ష రూపాయలు నేను తీసుకున్నా. మా తమ్ముడు రూ.50వేలు తీసుకున్నాడు. అయినా వడ్డీ కట్టలేదని, అసలు కట్టలేదని కడుపులో, డొక్కల్లో కొట్టారు. పొదలకూరు రమేష్ అనే వ్యక్తి నమ్మించి గొంతుకోశాడు. రూ.50వేలు తీసుకున్నాను. రూ.25వేలు కట్టా. రూ.25వేలు ఇవ్వాలి. ఇంటికొచ్చి బండి తీసుకెళ్లిపోయాడు. దానికి డ్యూ కూడా ఉంది. కరోనా వచ్చినా కూడా కనికరం లేకుండా మాట్లాడారు. గురవయ్య భార్య వచ్చి డబ్బులు ఇస్తారా? లేదా? పెళ్లాన్ని పడుకోబెట్టి డబ్బులివ్వాలి. అని చాలా అసహ్యంగా మాట్లాడారు. నా భార్య, బిడ్డలది, అమ్మానాన్నలది తప్పు లేదు.’ అని ఆ వ్యక్తి సెల్ఫీలో పేర్కొన్నాడు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు