ఢిల్లీ ఏపీ భవన్ వద్ద కలకలం..ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య!

లేఖలో అతను ఏం రాశాడన్నది తెలిస్తే ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ లేఖను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: February 11, 2019, 12:09 PM IST
ఢిల్లీ ఏపీ భవన్ వద్ద కలకలం..ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య!
ఏపీ భవన్ వద్ద వ్యక్తి ఆత్మహత్య..
news18-telugu
Updated: February 11, 2019, 12:09 PM IST
దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌ సమీపంలో సోమవారం తెల్లరుజామున ఓ వ్యక్తి మృతదేహాన్నిఅక్కడి సిబ్బంది గుర్తించారు.పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని పరిశీలించారు.మృతుడిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

చక్రాల కుర్చీలో మృతిచెందిన అతడి వద్ద ఒక లేఖ లభ్యమయ్యింది. పక్కనే చిన్న బాటిల్‌, రూ.20నోటును పోలీసులు గుర్తించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసమే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పోలీసులు మృతదేహాన్ని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు.పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు.లేఖలో అతను ఏం రాశాడన్నది తెలిస్తే ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ లేఖను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...