Home /News /andhra-pradesh /

MAN CLIMBED AND STAGE PROTEST ON CELL TOWER FOR THIS REASON IN EAST GODAVARI DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

East Godavari: తాగి సెల్ టవరెక్కిన వ్యక్తి.. వింత కారణమిని ఆశ్చర్యపోయిన పోలీసులు

పోశియ్యతో మాట్లాడుతున్న పోలీసులు

పోశియ్యతో మాట్లాడుతున్న పోలీసులు

Shocking: కొంతమంది తాగితే అంతే.. తిక్క తిక్క చేష్టలన్నీ చేస్తారు. ఏవో ఏవేవో గుర్తు చేసుకుని బాధ పడుతుంటారు. అలానే ఇక్కడ కూడా ఓ వ్యక్తి ఆదివారం కావడంతో ముక్క పట్టించి చుక్క నోట్లో పోసుకున్నాడు. తాగినోడు సైలెంట్‌గా ఉండక సెల్ టవర్ ఎక్కేశాడు.

ఇంకా చదవండి ...
    కొంతమంది తాగితే అంతే.. తిక్క తిక్క చేష్టలన్నీ చేస్తారు. ఏవో ఏవేవో గుర్తు చేసుకుని బాధ పడుతుంటారు. అలానే ఇక్కడ కూడా ఓ వ్యక్తి ఆదివారం కావడంతో ముక్క పట్టించి చుక్క నోట్లో పోసుకున్నాడు. తాగినోడు సైలెంట్‌గా ఉండక సెల్ టవర్ ఎక్కేశాడు. చచ్చిపోతానంటూ బెదిరించడంతో.. గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని అతన్ని కిందకి దింపేందుకు ఆపసోపాలు పడ్డారు. తీరా టవర్ ఎందుకు ఎక్కావు అన్న ప్రశ్నకు.. అతను చెప్పిన సమాధనం విని ఏం అనాలో తెలియక సైలెంట్‌గా ఇంట్లో వాళ్లకి అప్పగించి అక్కడ నుంచి వచ్చేశారు.  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని  తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన సలాది పోశియ్య ఆదివారం సాయంత్రం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి కూర్చున్నాడు.

    మద్యం ఫుల్లుగా తాగడంతో ఏమైంతుందోనని అందరూ భయపడ్డారు. బ్యాలెన్స్ తప్పితే టవర్ నుంచి కిందపడి చనిపోతాడని ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అక్కడికి చేరిన అగ్నిమాపక సిబ్బంది ఎంత బతిమాలినా పోశియ్య కిందకు దిగనంటూ మొండికేయడంతో కాసేపు అక్కడ హైడ్రామా నడిచింది. చివరికి ఎలాగొలా సిబ్బంది టవర్ ఎక్కి నెమ్మదిగా అతని చేతిని పట్టుకుని కిందకు దింపారు.

    ఇది చదవండి: పెళ్లైన మూడ్రోజులకే ప్రియుడితో జంప్.. కోపంతో యువతి కుటుంబం దారుణం


    పోశియ్యను కిందకు దింపిన తర్వాత.. సెల్ టవర్ ఎందుకు ఎక్కావని పోలీసులు ప్రశ్నించగా.. అతను చెప్పిన సమాధానం విని అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. తాను తాగాన మాట వాస్తవమేనని.. అది తాను కూడా ఒప్పుకుంటానని, పోలవరం మండం గూటాల ప్రాంతం నుంచి కాపవరానికి కాపురానికి వస్తే.. అందరూ ఎగతాళి చేస్తున్నారన్నారు. ఒంటరి కుటుంబం అంటూ తనను కొందరు అవమానిస్తున్నారని చెప్పారు. దాంతో పోలీసులు చేసేదేమీ లేక కాసేపు ఓదార్చి, కుటుంబ సభ్యులకు పోశియ్యను అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

    ఇది చదవండి: హాస్పిటల్‌లో దూరి.. మహిళలకు మత్తు ఇచ్చి.. ఆ తర్వాత సైలెంట్ గా పనికానిస్తాడు..


    గతంలోనూ చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి భార్య కాపురానికి రాలేదన్న కోపంతో సెల్ టవర్ ఎక్కాడు. మదనపల్లె పట్టణానికి చెందిన క్రాంతి, ప్రమీల దంపతుల మధ్య వివాదాలు తలెత్తాయి. క్రాంతి నిత్యం మద్యం తాగొస్తుండటంతో విసిగిపోయిన ప్రమీల పుట్టింటికి వెళ్లిపోయింది.



    పలుసార్లు ఇంటికి రావాలని భార్యను కోరినా ఆమె వినకపోవడంతో తాను తాగుడు మానేశానని రావాలని కోరాడు. భర్త మాటలు నమ్మిన ప్రమీల ఇంటికి వచ్చింది. కొన్నిరోజులు బాగానే ఉన్న క్రాంతి మళ్లీ తాగుడు మొదలుపెట్టాడు. దీంతో ఆమె మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రమీలను మెట్టినింటికి పంపేది లేదని ఆమె తల్లి, అన్న,.. క్రాంతికి తెగేసి చెప్పారు. భార్య ఇంటికి రాకపోవడం, అత్తింటివారు ఎదురుతిరగడంతో వారిని ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని భావించిన క్రాంతి.. మదనపల్లె- పుంగనూరు రోడ్డులోని డీఎస్పీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. హైడ్రామా అనంతరం అతడు కిందకి దిగిరావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, East Godavari Dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు