హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: ఫ్రెండ్ ఇచ్చిన చెత్త ఐడియాతో.. యూట్యూబ్ వీడియోలు చూసి భారీ స్కెచ్.. కానీ, పాపం అడ్డంగా బుక్కయ్యాడు

AP News: ఫ్రెండ్ ఇచ్చిన చెత్త ఐడియాతో.. యూట్యూబ్ వీడియోలు చూసి భారీ స్కెచ్.. కానీ, పాపం అడ్డంగా బుక్కయ్యాడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Anantapuram: ఎవరైనా సరే తమ సమస్యలను స్నేహితులతో పంచుకోవాలని అనుకుంటారు.. ఎందుకంటే ఏదైనా మార్గం ఉండొచ్చని. కానీ, అక్కడ స్నేహితుడిచ్చే ఉపాయం మనకి మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా అని ఆలోచించుకోవాల్సింది మాత్రం మనమే.. అలా కాకుండా గుడ్డిగా నమ్మితే ఇదిగో ఇలానే అడ్డంగా బుక్కవుతారు.

ఇంకా చదవండి ...

అందరికీ సమస్యలుంటాయి.. కొన్నింటికి పరిష్కారం ఉంటుంది, ఇంకొన్నింటికి ఉండదు. ఎవరైనా సరే తమ సమస్యలను స్నేహితులతో పంచుకోవాలని అనుకుంటారు.. ఎందుకంటే ఏదైనా మార్గం ఉండొచ్చని. కానీ, అక్కడ స్నేహితుడిచ్చే ఉపాయం మనకి మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా అని ఆలోచించుకోవాల్సింది మాత్రం మనమే.. అలా కాకుండా గుడ్డిగా నమ్మితే ఇదిగో ఇలానే అడ్డంగా బుక్కవుతారు. ఓ ఫ్రెండ్ ఇచ్చిన చెత్త ఐడియాతో.. అసలే ఆర్థిక సమస్యలతో ఉన్న అతను ఇప్పుడు జైలుకెళ్లి చిప్ప కూడు తినాల్సిన గతి పట్టింది. వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District) యల్లనూరు మండలం కూచివారిపల్లికి చెందిన చక్రపాణి అనే అతను అందినకాడల్లా రూ.లక్షల్లో అప్పులు చేశాడు. భార్య, పిల్లలున్న చక్రపాణికి ఈ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాలేదు.

ఈ క్రమంలోనే తండ్రితో గొడవపడి పుట్లూరు మండలం రంగనాయనపల్లిలోని అత్తగారింటికి చేరుకున్నాడు. ఈ సమయంలోనే తన స్నేహితుడు సాయితేజ గుర్తుకురావడంతో.. అతనికి తన బాధలన్నీ చెప్పాడు. దాంతో దీనికి ఒక్కటే మార్గం ఉందన్న సాయితేజ.. చక్రపాణికి ఒక ఐడియా ఇచ్చాడు, అలా చేస్తేనే అప్పులు తీరతాయని చెప్పడంతో చక్రపాణి కూడా గుడ్డిగా ఫాలో అయ్యాడు.

ఇది చదవండి: పెళ్లైన మూడ్రోజులకే ప్రియుడితో జంప్.. కోపంతో యువతి కుటుంబం దారుణం


ఇంతకీ స్నేహితుడు సాయితేజ ఇచ్చిన ఐడియా ఏంటంటే.. యూట్యూబ్‌ (YouTube) లో వీడియోలు చూసి గ్యాంగ్‌స్టర్‌గా మారి, బెదిరించి డబ్బులు సంపాదిచొచ్చని. ఇద్దరూ కలిసి ఆ వీడియోలు అన్నీ చూసి డబ్బులు ఎక్కువగా డాక్టర్ల దగ్గర ఉంటాయని డిసైడ్ అయ్యి.. స్థానిక మాధురి వైద్యశాల వైద్యుడిని బెదిరించి రూ.20 లక్షలు వసూలు చేయాలని పథకం రచించారు. అందులో భాగంగానే 'రూ.20 లక్షలు ఇవ్వాలని లేకుంటే నిన్ను, నీ కుటుంబ సభ్యులను కాల్చి చంపుతాము. బెంగళూరు హైవే దగ్గరకు డబ్బులు తీసుకురావాలి' అని లెటర్‌‌లో రాసి బైక్‌లో పెట్టుకుని డాక్టర్ ఇంటి దగ్గర పడేయడానికి వెళ్తున్నాడు.

సరిగ్గా ఈ సమయంలోనే.. బుక్కరాయసముద్రం చెరువుకట్టపై పోలీసులు సాధారణ తనిఖీల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ఇది చూసిన చక్రపాణి వారిని చూసి బైక్ వదిలేసి పారిపోయాడు. దాంతో పోలీసులు అతన్ని పట్టుకుని, బైక్‌ను పరిశీలించగా.. ఈ లెటర్లు దొరకడంతో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన స్టయిల్‌లో విచారించగా అసలు విషయం కక్కేశాడు. తన స్నేహితుడి సలహాతోనే ఇలా చేశానని అంగీకరించాడు. దాంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో యూట్యూబ్ చూసి దొంగనోట్లు, బాంబులు తయారు చేసిన ప్రబుద్ధులు పోలీసులకు చిక్కారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, Youtube

ఉత్తమ కథలు