Home /News /andhra-pradesh /

MAN BOOKED FOR ROBBED IN MORE SUPER MARKET WITH DUPLICATE KEY IN TIRUPATI ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Tirupahti News: తిన్నింటికే కన్నం వేసిన కేటుగాడు.. అన్నీ మేనేజ్ చేసినా చిన్న క్లూతో ఇలా దొరికిపోయాడు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Robbery: వేసిన తాళం వేసినట్లే ఉంది. సెక్యూరిటీ సైరన్ మ్రోగలేదు. కానీ క్యాష్ కౌంటర్ లో పెట్టిన సొమ్ము మాత్రం మాయమైంది. ఐతే ఓ చిన్నక్లూ దొంగను పోలీసులకు పట్టించింది.

    GT Hemanth Kumar, Tirupathi, News18

    షాపులు, ఇళ్లలో ఉద్యోగాలంటే నమ్మకం, నిజాయితీలపై ఆధారపడి‌ ఉంటుంది. జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనలో నమ్మకాన్ని నాశనం చేస్తుంటాయి. కొన్ని సందర్భాలు మనల్ని మనమే మోసం చేసుకున్నామా అనే డైలమాలో పడేస్తాయి. అందులో ప్రధానమైనది అందరిని గుడ్డిగా నమ్మటం. ప్రతి విషయంలోను నమ్మకం అనే‌ది లేక పోతే జీవితం ఒక్క‌ అడుగు‌ కూడా ముందుకు సాగదు. అలాంటిది ఓ పెద్ద సూపర్ మార్కెట్ కు మేనేజర్ గా నమ్మకమైన వ్యక్తిని పెట్టుకుంటారు. అలా నమ్మకంతో ఓ వ్యకితిని నియమించుకున్న సంస్థకు కన్నం వేశాడో కేటుగాడు. తనకు తెల్సిన అన్ని దారుల్లో వెళ్లి ఎక్కడా దొరక్కుండా అనుకున్నపని పూర్తి చేశాడు. కానీ ఒక్క చిన్నక్లూ అతడ్ని పట్టించింది.

    వివరాల్లోకి వెళితే.., ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం సీఆర్ కుప్పంలో నివాసం ఉంటున్నాడు సురేష్ బాబు. తిరుపతి లోని ప్రముఖ సూపర్ మార్కెట్ మోర్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. చాల కాలం అక్కడే పనిచేసిన సురేష్ బదిలీపై పుత్తూరు శాఖకు వెళ్ళాడు. అయితే ఆదివారం రాత్రి మోర్ సూపర్ మార్కెట్ లో భారీగా చోరీ జరిగింది. వేసిన తాళం వేసినట్లే ఉంది. సెక్యూరిటీ సైరన్ మ్రోగలేదు. కానీ క్యాష్ కౌంటర్ లో పెట్టిన సొమ్ము మాత్రం మాయమైంది. చోరీ జరిగిందని గుర్తించిన కొత్త మేనేజర్ మంజునాథ్ చోరీ వెంటనే తనపై అధికారులకు సమాచారమందించాడు. మొత్తం రూ.2.7 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించి ఎంఆర్ పల్లి పోలీసుకు ఫిర్యాదుచేశాడు.

    వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. తాళాలు వేసే ఉండటం, సూపర్ మార్కెట్లో కాసేపు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఇది కచ్చితంగా ఇంటిదొంగల పనేనని భావించారు. సీసీ కెమెరాలకు పవర్ కట్ అయిన ముందు రికార్డైన ఫుటేజ్ ను పరిశీలించగా షాకింగ్ సీన్ కనిపించింది.

    దొంగ ముందుగా సూపర్ మార్కెట్ షట్టర్ ను తాళాలతోనే ఓపెన్ చేశాడు. ఆ వెంటనే సీసీ కెమెరాలకు సప్లై అయ్యే పవర్ ప్లగ్ లను పీకేసాడు. ఆ తర్వాత నేరుగా లాకర్ వద్దకు వెళ్లి తన దగ్గర ఉన్న డమ్మీ తాళంతో లాకర్ ను ఓపెన్ చేసి డబ్బు తీసుకొని వెళ్లిపోయాడు. కెమెరాలు స్విచ్ ఆఫ్ చేయక ముందు కనపడిన దృశ్యాల మేరకు పాత దొంగ ఎవరో కాదు గతంలో మేనేజర్ పనిచేసిన సురేష్ బాబే దొంగగా గుర్తించారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. గతంలో ఇక్కడ మేనేజర్ గా పనిచేసే సమయంలో తన వద్ద ఉండే షట్టర్, క్యాష్ కౌంటర్, లాకర్ నకిలీ తాళాలను గాంధీ రోడ్డులో తాయారు చేయించినట్లు విచారణలో తెలిపాడు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు