Home /News /andhra-pradesh /

MAN BOOKED FOR RAPE AND BLACK MAILING FRIENDS WIFE IN NELLORE DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Nellore Woman: భర్తను మద్యానికి బానిసను చేసి భార్యపై అత్యాచారం.. ఆ పై బ్లాక్ మెయిలింగ్.. చివర్లో ఊహించని ట్విస్ట్..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Nellore News: భర్త వ్యసనాలకు బానిసైతే ఇంట్లో భార్య ఎదుర్కొనే అత్యంత దారుణమైన పరిస్థితి ఇది. నిషా కోసం అతడు తొక్కిన అడ్డదారి చివరకి తన ఇల్లాలి మానాన్ని బలితీసుకుంది. జరిగిన ఘోరం తెలియగానే మత్తువదిలింది. అవమానం, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకునేవరకు వెళ్లింది.

ఇంకా చదవండి ...
    భర్త వ్యసనాలకు బానిసైతే ఇంట్లో భార్య ఎదుర్కొనే అత్యంత  దారుణమైన పరిస్థితి ఇది. నిషా కోసం అతడు తొక్కిన అడ్డదారి చివరకి తన ఇల్లాలి మానాన్ని బలితీసుకుంది. జరిగిన ఘోరం తెలియగానే మత్తువదిలింది. అవమానం, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకునేవరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా (Nellore District) లింగ సముద్రం మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు నివాసముంటున్నారు. తాగుడుకు బానిసైన భర్త.. కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఇదే సమయంలో అతడి భార్యపై కన్నేసిన స్నేహితుడు తన కోరిక తీర్చుకోవాలని పన్నాగం పన్నాడు. భర్తకు అడినంత మందు పోయిస్తూ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అతడి ద్వారానే  భార్యకు మత్తుమంది ఇప్పించాడు. ఆమె స్పృహతప్పి పడిపోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా చాలాసార్లు ఆమెపై పశువాంఛ తీర్చుకున్నాడు.

    అంతేకాదు ఆమెను అత్యాచారం చేసే సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో వేధింపులు తట్టుకోలేక విషయాన్ని భర్తతో చెప్పింది. ఇద్దర్నీ వేధిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో చేసేది లేక పురుగుల మందు తాగి ఆత్మహయత్యకు యత్నించారు. గ్రామస్తులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఐతే ఆత్మహత్యాయత్నానికి ముందు భార్యాభర్తలిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు.

    షేక్ ఇలియాజ్ అనే వ్యక్తి తమను వేధిస్తున్నాడని.. తన భర్తను మద్యానికి బానిసను చేసి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. అంతేకాదు వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. అవమానం, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భార్యాభర్తలిద్దరూ  చెప్పారు. తమ చావు తర్వాతైనా అతడ్ని కఠినంగా శిక్షించాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Nellore Dist, RAPE

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు