MAN BOOKED FOR HARASSING WIFE WITH NUDE VIDEOS IN KADAPA DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
Blackmail: ప్రేమ పేరుతో శారీరక బంధం.. నగ్నవీడియోలతో బ్లాక్ మెయిలింగ్.. పెళ్లిచేసినా మారని మృగాడు..
(ప్రతీకాత్మక చిత్రం)
Lovers: ప్రేమించిన వారి కోసం ఏం చేసినా తప్పులేదని భావిస్తుంటారు యువతీ యువకులు. ముఖ్యంగా యువతులు తాము ఏం చేస్తున్నారో తెలిసేలోపే సర్వం కోల్పోతుంటారు. అలా ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మిన ఓ యువతి నిస్సాహాయస్థితిలో మిగిలిపోయింది.
ప్రేమ ఓ మైకం. ప్రేమలో మునిగి తేలుతున్నవారికి లోకం తెలియదు. ప్రేమించిన వారి కోసం ఏం చేసినా తప్పులేదని భావిస్తుంటారు యువతీ యువకులు. ముఖ్యంగా యువతులు తాము ఏం చేస్తున్నారో తెలిసేలోపే సర్వం కోల్పోతుంటారు. అలా ప్రేమించిన వాడిని గుడ్డిగా నమ్మిన ఓ యువతి నిస్సాహాయస్థితిలో మిగిలిపోయింది. అతగాడి చేతిలో ఆటబొమ్మలా మారిపోయింది. ఎన్నిరకాలుగా యత్నించినా ప్రేమించిన వాడ్ని క్రూరత్వం నుంచి బయటకు తీసుకురాలేకపోయింది. చివరకి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కడప జిల్లా (Kadapa District) రాయచోటికి చెందిన యువతికి.. అదే పట్టణానికి చెందిన చికెట్ షాపు యజమాని అయిన యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలెసుకొని తిరిగారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మంచిన ప్రియుడు ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు.
తీయని మాటలు చెబుతూ పలుసార్లు లైంగిక అవసరాలు తీర్చుకున్నాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉండగా వీడియోలు తీశాడు. అలాగే యువతిని నగ్నంగా ఫోటోలు కూడా తీసుకున్నాడు. ఐతే తనవాడే కదా అని నమ్మిన యువతి వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చడంతో విషయాన్ని ప్రియుడికి చెప్పి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. ఐతే ఇప్పుడే పెళ్లి వద్దని ఆమెకు మాయమాటలు చెప్పి బలవంతంగా అబార్షన్ చేయించాడు.
ఆ తర్వాత కూడా ఆమె పెళ్లి చేసుకోవాలని నిలదీసినప్పుడల్లా నగ్న వీడియోలు చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఓ రోజు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో గత ఏడాది సెప్టెంబర్లో పోలీసులు ఇద్దరికీ పెళ్లి జరిపించారు. మరోసారి తప్పుగా ప్రవర్తించవద్దని హెచ్చరించి పంపేశారు. ఐతే పోలీసులు వార్నింగ్ ఇచ్చినా మనోడిలో మార్పురాలేదు.
భార్యను నిత్యం చిత్రహింసలు పెడుతూ ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను ఫేక్ ఎకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో పెట్టడం మొదలుపెట్టాడు. తరచూ తీవ్రంగా కొట్టడంతో ఆమె నడవలేని స్థితికి చేరుకుంది. అతడి ఆగడాలకు ఎలాగైనా చెక్ పెట్టాలని భావించిన బాధితురాలు.. ఏకంగా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు మంగళగిరి వెళ్లింది. అక్కడ అధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. తనను వేధిస్తున్నవాడిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని వేడుకుంది.
యువతి ఫిర్యాదుపై స్పందించిన డీజీపీ కార్యాలయ అధికారులు వెంటనే కడప ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందించారు. కడప ఎస్పీ సాయంతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తనను జీవచ్ఛవంలా మార్చిన మృగాడ్ని కఠినంగా శిక్షించాలని యువతి పోలీసులను వేడకుంది. దీనిపై కడప పోలీసులు ఇంకా స్పందించలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.