GT Hemanth Kumar, News18, Tirupati
హిందూ సంప్రదాయంకు నిర్వచనం ఏకపత్నీ వ్రతం. రాముడు ఏకపత్ని వ్రతుడై లోక రక్షకుడైయ్యాడని పురాణాలు చెబుతాయి. యుగాలు, కాలాలు మారుతున్న కొద్దీ మనిషి ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. కామం., వ్యామోహం మాయలో పడి.., మోసాలకు పాల్పడుతున్నారు. తాత్కాలిక శుఖాల వెంట పరుగులు పెడుతున్నారు. ఇంట్లో భార్య ఉండగానే మరో మహిళ వెనుకపడుతున్నారు. ఇక భర్త ఆఫీస్ కు వెళ్ళగానే వేరొక వ్యక్తితో సహజీవనమే చేసేస్తున్నారు కొందరు మహిళలు. కానీ ఓ కేబుల్ టీవీ ఆపరేటర్ వక్ర బుద్దితో ఇంట్లో ఇల్లాలు., వంటిట్లో ప్రియురాలు సినిమాను తలపించేలా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్ళైన నాలుగేళ్ళలకు మరో మహిళ మెడలో సీక్రెట్ గా మూడు ముళ్లు వేశాడు. తన అనుమానాస్పద ప్రవర్తనతోనే రెండవ భార్యకు చిక్కాడు. చివరికి ఇద్దరు భార్యలు జుట్టు పట్టుకొని కొట్టుకున్న సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా (Nellore District) గూడూరులో కేబుల్ ఆపరేటర్ పనిచేస్తున్నాడు వేణుగోపాల్. హ్యాపీగా లైఫ్ ను సాగిస్తున్న వేగుగోపాల్ కు ఐదేళ్ల క్రితం తన అక్క కూతురితో వివాహం అయింది. ఇద్దరు చాల సంతోషంగా జీవిస్తూ ఉండే వారు. కొంత కాలంగా బయట పనులు ఉన్నాయంటూ భర్త తరచు బయటకు వెళ్ళేవాడు. దీంతో మా మామ మంచి వాడని మరదలు ఎక్కువగా పట్టించుకునేది కాదు. భార్యకు తనపై ఉన్న నమ్మకంతో వేణు గోపాల్ వక్రంగా ఆలోచించడం మొదలెట్టాడు. గతేడాది మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో తన పేరు వివరాలు నమోదు చేసుకున్నాడు
మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లోనే అనంతపురం జిల్లా (Anantapuram District) కదిరిలో నివాసం ఉంటున్న రూపతో పరిచయం ఏర్పడింది. రూప ఉద్యోగ రీత్యా సచివాలయ పోలీస్ గా విధులు నిర్వహిస్తుంది. వీరిద్దరి మనషులు కలిసాయి. తనకు ఇదివరకే వివాహమైన విషయాన్ని దాచిన వేణుగోపాల్.... రూపకు ప్రేమ పాటలు నేర్పాడు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కదిరిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో పెళ్లి చేసుకొని జంట ఒక్కటైయ్యారు. పెళ్ళైన కొంతకాలం కదిరిలోనే కాపురం పెట్టారు.
వాస్తవానికి భర్త వేణుగోపాల్ స్వస్థలం నెల్లూరు కావడంతో అక్కడికి తీసుకెళ్లమని భార్య రూప పలుమార్లు భర్తను కోరింది. ఏవేవో సాకులు చెప్తూ భర్త వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తూ వచ్చాడు. కొన్నాళ్ళు రూపకు ఎటువంటి అనుమానం రాకుండా ఎంతగానో మ్యానేజ్ చేశాడు. సొంతూరి ప్రస్తావన తెచ్చిన సమయంలో భర్త వేణుగోపాల్ మొఖంలో భయాన్ని గుర్తించింది భార్య రూప. నిజమేంటని గట్టిగా నిలదీసింది. అదే విషయంపై ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. అదే క్రమంలో బంధువులను విచారించగా.. తన భర్త వేణుగోపాల్ చేసిన మోసం బయటపడింది. దీంతో భర్త ఇంటికి చేరుకొని మొదటి భార్యతో నివాసం ఉంటున్న ఇంటి వద్ద నిరసనకు దిగింది. దీంతో వేణుగోపాల్ మొదటి భార్య రెండవ భార్య రూపపై దాడికి దిగింది. మొదటి భార్యతో పాటు ఆమె బంధువులు కూడా రూప పై దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Cheating, Nellore Dist