హోమ్ /వార్తలు /andhra-pradesh /

Eluru News: యవతి నిద్రిస్తుండగా గదిలోకి వెళ్లిన యువకుడు.. కేకలు విని పరుగులు పెట్టగా షాకింగ్ దృశ్యం

Eluru News: యవతి నిద్రిస్తుండగా గదిలోకి వెళ్లిన యువకుడు.. కేకలు విని పరుగులు పెట్టగా షాకింగ్ దృశ్యం

West Godavari: తండ్రి మృతి చెందాడు. తల్లి దేశం కాని దేశంలో ఉంటోంది.  అమ్మమ్మ దగ్గరే ఉంటూ తమ్ముణ్ణి చూసుకుంటోంది. ఎప్పుడూ చలాకీగా ఉండే ఆమెపై ఓ మృగాడి కన్నుపడింది.

West Godavari: తండ్రి మృతి చెందాడు. తల్లి దేశం కాని దేశంలో ఉంటోంది. అమ్మమ్మ దగ్గరే ఉంటూ తమ్ముణ్ణి చూసుకుంటోంది. ఎప్పుడూ చలాకీగా ఉండే ఆమెపై ఓ మృగాడి కన్నుపడింది.

West Godavari: తండ్రి మృతి చెందాడు. తల్లి దేశం కాని దేశంలో ఉంటోంది. అమ్మమ్మ దగ్గరే ఉంటూ తమ్ముణ్ణి చూసుకుంటోంది. ఎప్పుడూ చలాకీగా ఉండే ఆమెపై ఓ మృగాడి కన్నుపడింది.

    చిన్నప్పటి నుంచి ఆమెను దురదృష్టం వెటాడింది. తండ్రితో ఆడుకోవాల్సిన వయసులో ఆయన్ని మృత్యువు తీసుకెళ్లిపోయింది. ఉపాధి కోసం తల్లి దేశం కాని దేశంలో ఉంటోంది. అమ్మమ్మ దగ్గరే ఉంటూ తమ్ముణ్ణి చూసుకుంటోంది. ఎప్పుడూ చలాకీగా ఉండే ఆమెపై ఓ మృగాడి కన్నుపడింది. అర్ధరాత్రి నిద్రిస్తుండగా కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించడమేకాకుండా దారుణంగా హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) కాళ్ల మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన కల్యాణి.. తన అమ్మమ్మ దుర్గ వద్ద ఉంటోంది. ఆమె తండ్రి గతంలోనే మృతి చెందగా.. తల్లి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లింది. ఈ క్రమంలో ఈనెల 3వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తోంది. ఆమె అమ్మమ్మ దుర్గ.. కల్యాణి తమ్ముడితో కలిసి మరో గదిలో నిద్రిస్తోంది.

    అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత గ్రామానికి చెందిన తిరుమల సాయిప్రసాద్ అనే యువకుడు దొంగతనంగా ఇంట్లో ప్రవేశించాడు. దుర్గ నిద్రిస్తున్న గదికి గడియపెట్టి.. కల్యాణి గదిలోకి వెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఐతే మృగాడి ఘాతుకాన్ని ప్రతిఘటించిన కల్యాణి గట్టికా కేకలు వేస్తూ అమ్మమ్మని పిలిచింది. ఈ పెనుగులాటలో సాయిప్రసాద్.. కల్యాణ్ తలను నెలకేసికొట్టాడు. దీంతో ఆమె బండరాయిమీద పడి మృతి చెందింది.

    ఇది చదవండి: ఫ్రెండ్స్ లవర్ తో యువకుడి ఎఫైర్.. కొన్నాళ్ల తర్వాత షాకింగ్ ట్విస్ట్..

    మరోవైపు మనవరాలి కేకలు విని నిద్రలేచిన దుర్గ.. తలుపులు తీసేందుకు యత్నించగా రాలేదు. దీంతో గట్టిగా అరిచింది. చుట్పక్కలవాళ్లు వచ్చి తలుపులు తెరవగా పక్కగదిలోకి వెళ్లి చూసింది. అక్క కల్యాణి రక్తపుమడుగులో పడిఉంది. చుట్టుపక్కలవారు సాయిప్రసాద్ ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

    ఇది చదవండి: భార్య ఫ్రెండ్ తో ఎఫైర్.. కానీ కొన్ని రోజులకే కనిపించకుండా పోయాడు.. 

    ఇదిలా ఉంటే నిందితుడు సాయిప్రసాద్ గ్రామ సర్పంచ్ తిరుమల భాస్కరరావు కుమారుడని తేలింది. దీంతో ఘటనపై గ్రామపెద్దలు రాజీకుదిర్చి మృత దేహం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కల్యాణి డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తీసుకొని సాయి ప్రసాద్ పై కేసు నమోదు చేశారు.

    ఇది చదవండి: ఇద్దరూ ఎవరి అదుపులో వాళ్లుంటే బాగానే ఉండేది.. కానీ ఏం చేస్తాం.. వినిపించుకోలే..

    గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. రేపల్లె మండలం ఊలుపాలెం గ్రామానికి చెందిన కైతేపల్లి రవి అనే యువకుడు తెనాలిలో కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. పనిచేసే ప్రాంతంలో తెనాలి పట్టణానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాడు. దీంతో ఆమె గర్భందాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని యువతి నిలదీయడంతో అతడు నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    First published:

    ఉత్తమ కథలు