చంద్రబాబులో కొత్త ఉత్సాహం... మమతా బెనర్జీ ఫార్ములాని ఫాలో అవుతున్నారా...

AP Assembly Elections : ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో కలిపి ఇంకా 8 రోజులే ఉంది. ఈ లోపే వీలైనన్ని నియోజకవర్గాలు చుట్టేసేలా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 2, 2019, 6:25 AM IST
చంద్రబాబులో కొత్త ఉత్సాహం... మమతా బెనర్జీ ఫార్ములాని ఫాలో అవుతున్నారా...
మమతా బెనర్జీ, చంద్రబాబు
  • Share this:
మార్చి 31న తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ విశాఖపట్నం వచ్చారు. చంద్రబాబు తరపున ప్రచార సభలో పాల్గొన్నారు. ఈటెల్లాంటి మాటలతో... కేంద్రంపై విరుచుకుపడ్డారు. పైకి సైలెంట్‌గా కనిపించే మమతా బెనర్జీ... ఆ సభలో ప్రసంగించినప్పుడు మాత్రం కోల్‌కతా కాళీమాతలా విశ్వరూపం ప్రదర్శించడంపై టీడీపీలో కొత్త చర్చ మొదలైంది. తనకు సంబంధంలేని రాష్ట్రానికి వచ్చి... కేంద్ర ప్రభుత్వంపై హై వోల్టేజ్ కౌంటర్లు వేసిన మమతా బెనర్జీని చూసి చాలా నేర్చుకోవాలనీ... ఆమెలాగే చురుకైన ప్రసంగాలు చెయ్యాలనీ, ప్రజల్లో ఎక్కడలేని ఉత్సాహం తీసుకురావాలనీ టీడీపీ నేతలు భావించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి రోజు చిత్తూరు జిల్లాలో రోడ్ షోలు చేసిన చంద్రబాబు ప్రసంగంలో చాలా మార్పు కనిపించింది. దాదాపు ఆయన మళ్లీ సీఎం అయిపోయినట్లుగా... కొత్త హామీలన్నీ అమలు చేసేస్తున్నట్లుగా... రాష్ట్రాన్ని టెక్నికల్‌గా అత్యంత ముందుకు తీసుకుపోయినట్లుగా ఉత్తేజభరితంగా ప్రసంగించారు. మిగతా పార్టీల నేతలంతా ప్రచారం ముగించినా... చంద్రబాబు ప్రచారం మాత్రం రాత్రి 10 తర్వాత కూడా కొనసాగింది.

విశాఖ సభలో మమతా బెనర్జీ మాట్లాడింది పది నిమిషాలే. ఆ కాస్త సమయంలోనే ఆమె నరేంద్రమోదీ ఈసారి ఎందుకు అధికారంలోకి రారో... తనదైన విశ్లేషణ చేశారు. కేంద్రంపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోదీకి సవాళ్లు విసిరారు. విశాఖ ప్రజలతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. ప్రజలను ప్రశ్నలు అడుగుతూ... వారి నుంచీ సమాధానాలు రాబడుతూ... అత్యంత ఉత్తేజపూరితంగా, అత్యంత ఆవేశభరితంగా, అత్యంత ఆగ్రహంతో రగిలే అగ్నిపర్వతంలా ప్రసంగించడం టీడీపీ నేతలకు కొత్త ఉత్సాహం తెచ్చిందంటున్నారు విశ్లేషకులు. పార్టీలోని ప్రతీ ఒక్కరూ మమతా బెనర్జీలాగా దాటియైన ప్రసంగాలతో చెలరేగిపోతే... ఆ మాటలు ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళ్లి... బలమైన ఓటు బ్యాంక్ సాధ్యమవుతుందని టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నట్లు తెలిసింది.


నిజానికి బెంగాల్‌లో మమతా బెనర్జీ ఏమంత గొప్పగా పరిపాలించట్లేదు. ఆమె అధికారంలోకి వచ్చాక... బెంగాల్ రూపురేఖలేవీ అనూహ్య రీతిలో మారిపోయిందీ లేదు. కనీసం కోల్‌కతా కూడా అభివృద్ధి చెందలేదు. అవే సమస్యలు, అదే పేదరికం. అయినప్పటికీ... తన పాలనకు వంద మార్కులు వేసుకుంటున్న దీదీ... కేంద్రాన్ని దుమ్మెత్తిపొయ్యడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. ఈ ఫార్ములాను తమకూ వర్తింపజేసుకుంటున్నారు టీడీపీ నేతలు. ఈ ఐదేళ్లలో టీడీపీ పాలనకు వందకు పైగా మార్కులు వేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు... కేంద్రంలో బీజేపీకీ, రాష్ట్రంలో ప్రతిపక్ష వైసీపీకీ సవాళ్లు విసురుతూ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రసంగిస్తున్నారు.

మమత వచ్చి వెళ్లాక చంద్రబాబు ప్రసంగంలో వాడీ, వేడీ మరింత పెరిగింది. మొన్నటి దాకా కాస్త నీరసంగా ప్రసంగించిన ఆయన... ఇప్పుడు చెలరేగిపోతున్నారు. ఏం కావాలంటే అది ఇచ్చేస్తా, ఇంకా ఇంకా సంపద తెస్తా, ఇంకా ఇంకా పంచిపెడతా అంటూ... దూకుడుగా ప్రసంగిస్తున్నారు. రాజమండ్రి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీపై తీవ్రమైన కౌంటర్లు వేసిన చంద్రబాబు... ఆయనతోపాటూ... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్‌కి ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఆయనలో వచ్చిన ఈ దూకుడు మంత్రం వెనక దీదీ ప్రసంగం నుంచీ తెచ్చుకున్న స్ఫూర్తి ఉందని తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి :

ప్రతిపక్షాల విమర్శలే తమ నినాదాలు... బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ... అధికార పార్టీల కొత్త ఎత్తుగడనరేంద్ర మోదీ, చంద్రబాబు ట్వీట్ల వార్... ఎవరూ వెనక్కి తగ్గట్లేదుగా...

ఏపీలో పెరిగిన బెట్టింగుల జోరు... వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ...

వైసీపీలో చేరిన రాజశేఖర్, జీవిత... టీడీపీ, జనసేన తోడుదొంగలు అంటూ ఫైర్...
First published: April 2, 2019, 6:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading