Home /News /andhra-pradesh /

Richest WOmen: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా ధనవంతురాలు ఎవరో తెలుసా..? ఆస్తుల విలువ ఎంతంటే

Richest WOmen: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా ధనవంతురాలు ఎవరో తెలుసా..? ఆస్తుల విలువ ఎంతంటే

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నురాలు

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నురాలు

Richest Woman in telugu states: సంపాదనలోనూ మన తెలుగు అమ్మాయిలు దూకుడు చూపిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత ధనవంతు రాలు ఎవరో తెలుసా..? ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ ఎంత ఉంటుందో ఊహించగలరా..?

    Richest Women form Telugu States: మహిళలు అన్ని రంగంల్లో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా సంపాదన విషయంలో మొగాళ్లకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. అత్యంత చిన్న వయసులోనే ఆదాయం పై ఫోకస్ చేస్తున్నారు. తాజాగా
    ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021  ( IIFL Wealth Hurun India Rich List 2021) విడుదల చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాల (Telugu States)కు చెందిన శ్రీమంతుల్లో ఇద్దరు మహిళలు (Richest Womens) ఉండటం విశేషం. వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం.. బయోలాజికల్ ఈ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మాహిమా దట్లా (Mahima Datla) రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ధనిక మహిళగా (Richest WOmen) అవతరించిందని ఆ జాబితా సూచిస్తోంది. ప్రస్తుతం ఆమె నికర సంపద విలువ 7,700 కోట్ల రూపాయలు దాటింది. మొత్తం భారతదేశంలోని సంపన్నుల జాబితాలో మహిమ 231వ ర్యాంకు సాధించారు. తాజా నివేదిక బయటకు వచ్చిన దగ్గర నుంచి నెటిజన్లు ఈ మహిమా దట్టా ఎవరు..? ఏం చేస్తున్నారు..? ఆదాయ వనరులు ఏంటి.. అని పలు రకాలుగా ఆమె కోసం గుగూల్ లో సెర్చ్ చేస్తున్నారు..

    లండన్‌లోని వెబ్ స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన 44 ఏళ్ల మాహిమా 2001 నుంచి బయోలాజికల్ ఈ భాద్యతలు చేపట్టారు. ఆమె తాతలు 1948లో స్థాపించిన బయోలాజికల్ ప్రొడక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి హెపారిన్ అనే ఔషధాన్ని తయారు చేస్తోంది..

    ఇదీ చదవండి: ఈ జయ భరద్వాజ్ ఎవరు..? దీపక్ చాహార్ ప్రపోజ్ తో ఒక్కసారిగా పెరిగిన క్రేజ్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

    ఈ ఇండియా రిచ్ లిస్ట్ జాబితాలో ఉన్న మరో మహిళ ఎన్ ఏసీఎల్ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె లక్ష్మీరాజు ప్రస్తుతం ఆమె సంపద 1,000 కోట్ల కలిగి ఉన్నట్టు ఆ లెక్కలు చెబుతున్నాయి.
    ఇదీ చదవండి: ఛీ.. వ్యూస్‌ కోసం ఇంత దారుణమా..? ఓ తండ్రి పనిపై నెటిజన్ల మండిపాటు..? వైరల్ అవుతున్న వీడియో

    తెలుగు రాష్ట్రాల్లో ధనికుల జాబితాలో మహిమా 41వ స్థానంలో ఉండగా.. దాట్లా ఇంకా కుటుంబం మొత్తం ఆస్తుల జతాతాలో 15 స్థానాల్లో ఉన్నారు. భారతదేశంలోని సంపన్నుల జాబితాలో లక్ష్మీ రాజు 956వ ర్యాంకు సాధించారు. ఈ ఏడాది హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 69 మంది వ్యక్తులు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న వారి మొత్తం సంపద తెలుగు రాష్ట్రాల నుంచి రూ.3,79,200 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 54 శాతం పెరిగింది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు