రియల్ హీరో మహేష్ బాబు... 13నెలల చిన్నారికి గుండె ఆపరేషన్

దీంతో చిన్నారి పరిస్థితిని శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు సేవా సంఘం సమితి అధ్యక్షులు.. మహేష్ బాబు దృష్టికి తీసుకొచ్చారు.

news18-telugu
Updated: October 13, 2019, 3:58 PM IST
రియల్ హీరో మహేష్ బాబు... 13నెలల చిన్నారికి గుండె ఆపరేషన్
మహేష్ బాబు
  • Share this:
టాలీవుడ్ మహేష్ బాబు... రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా హీరోయేనని నిరూపించుకున్నాడు. గుండె సమస్యతో బాధపడుతున్న ఓ పసివాడికి తనవంతు సాయం చేస్తున్నారు. చిన్నారికి ఫ్రీగా గుండె ఆపరేషన్ చేయిస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందిన 13 నెలల సందీప్ అనే పసివాడికి గుండెలో మూడు రంధ్రాలు ఉన్నాయి. దీంతో డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయించకపోతే.. బాబు ప్రాణాలకే ప్రమాదమన్నారు. ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు అవుతుందన్నారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

దీంతో చిన్నారి పరిస్థితిని శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు సేవా సంఘం సమితి అధ్యక్షులు.. మహేష్ బాబు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ప్రిన్స్... ఆపరేషన్ ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చాడు. అంతేకాదు చిన్నారికి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రిలో ఆపరేషన్ కూడా చేయిస్తున్నాడు. మహేష్ గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న సాయానికి అందరూ శభాష్ అంటున్నారు. ఇక ఆ చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అయితే అవధులే లేవు. మహేష్ బాబు మనసున్న మారాజు అంటూ... వారు కొనియాడుతున్నారు. దేవుడులా తన బిడ్డను ఆదుకున్నాడంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలామంది చిన్నారులకు హార్ట్ కు సంబంధించిన సమస్యలకు సాయం చేస్తుంటారు.

First published: October 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు