
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
మహారాష్ట్ర ప్రభుత్వం సైతం మహిళలపై అత్యాచారాలను నిరోధించే క్రమంలో భాగంగా ఏపీ దిశా చట్టాన్ని తమ రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు అధ్యయనం చేస్తోంది.
ఏపీ ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న దిశ చట్టంపై ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం దృష్టి సారించాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం మహిళలపై అత్యాచారాలను నిరోధించే క్రమంలో భాగంగా ఏపీ దిశా చట్టాన్ని తమ రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు అధ్యయనం చేస్తోంది. ఏపి ప్రభుత్వం అత్యాచార కేసుల్లో నిందితులకు మరణ శిక్ష పడేలా చేయడంతో పాటు 21 రోజుల్లోనే తీర్పు వెలువడేలా దిశ చట్టాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోనూ దిశ యాక్ట్ అమల్లోకి తెచ్చేందుకు, చట్టంపై అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర సర్కారు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. మార్చి 30వ తేదీలోపు నివేదిక అందజేయాలని ఈ కమిటీని ఆదేశించినట్టు ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. దిశ చట్టం గురించి తెలుసుకునేందుకు తాము ఏపీలో పర్యటించామని చెప్పారు. ఇదిలా ఉంటే దిశ చట్టంపై ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఏపీ సర్కారు అమలు చేస్తున్న దిశ చట్టం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తోంది.
Published by:Krishna Adithya
First published:February 24, 2020, 18:40 IST