మునిగిన మహానంది ఆలయం... నిలిచిన స్వామి దర్శనం

భారీగా వరద ప్రవాహం ఉండటంతో మహానంది ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. మహానంది పరిసర ప్రాంతాలు నీట మునిగిపోయాయి.

news18-telugu
Updated: September 17, 2019, 1:42 PM IST
మునిగిన మహానంది ఆలయం... నిలిచిన స్వామి దర్శనం
మహానంది ఆలయంలోకి భారీగా వరద నీరు
  • Share this:
కర్నూలు జిల్లాలో కుండ పోత వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని మహానంది ఆలయం జలదిగ్భంధంలో చిక్కుకుంది.
ఆలయంలో మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. పంచలింగాల మండపం, కోనేరు పూర్తిగా నీట మునిగిపోయాయి. భారీగా వరద ప్రవాహం ఉండటంతో మహానంది ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. మహానంది పరిసర ప్రాంతాలు నీట మునిగిపోయాయి. మరోవైపు కుందూరు నది ఉధృతంగా ప్రవహరిస్తోంది. మహానందిలో పాలేరు వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో నంద్యాల, గాజులపల్లి, మహానంది మధ్య రాకపోకలు నిలిచిపోయాయి

మనోవైపు జిల్లాలో సిరివేళ్ళ, రుద్రవరం, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దొరనిపాడు మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 224 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వాన నీరు ఇళ్లలోకి చేరడంతో నిత్యావసర సరుకులు తడిచి జనం నానా అవస్థలు పడుతున్నారు.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading