వైసీపీ నేత కుమారుడిపై హత్యాయత్నం, పెట్రోల్ పోసి నిప్పంటించిన మొదటి భార్య

ఖాదర్‌భాషా (File)

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత కుమారుడిపై హత్యాయత్నం జరిగింది. మచిలీపట్నం మార్కెట్‌ యార్డు చైర్మన్‌ అచ్చాబా కుమారుడు ఖాదర్‌భాషాపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

  • Share this:
    కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత కుమారుడిపై హత్యాయత్నం జరిగింది. మచిలీపట్నం మార్కెట్‌ యార్డు చైర్మన్‌ అచ్చాబా కుమారుడు ఖాదర్‌భాషాపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆయన ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, మార్కెట్ యార్డు చైర్మన్ కుమారుడి మీద హత్యాయత్నం అనగానే రాజకీయాలు ఉన్నట్టు భావించారు. కానీ, పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో అతడి భార్య ఈ పనిచేసినట్టు తెలిసింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఖాదర్ బాషాపై అతడి మొదటి భార్య ఇలా పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

    ఖాదర్ 14 ఏళ్ల క్రితం షేక్ నదియాను వివాహం చేసుకున్నారు. ఇటీవల ఆయన తన భార్య నదియాకు తెలియకుండా ఆమె సొంత చెల్లెల్ని రెండో వివాహం చేసుకున్నాడు. రెండో వివాహం విషయంలో నదియా, ఖాదర్ ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య నదియా ఖాదర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిందని భావిస్తున్నారు. గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రగాయాలతో ఉన్న ఖాదర్ ఇప్పుడు విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగినట్లుగా పోలీసులు కూడా భావిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యుల ప్రమేయం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: