హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Krishna District: మచిలీపట్నంలో యువతిపై గ్యాంగ్ రేప్..? పోలీసులమంటూ తసుకెళ్లి ఘాతుకం.. న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్

Krishna District: మచిలీపట్నంలో యువతిపై గ్యాంగ్ రేప్..? పోలీసులమంటూ తసుకెళ్లి ఘాతుకం.. న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Krishna District: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో దాదాపు నెలరోజుల నుంచి వేడుకలు చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లయినా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Machilipatnam, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో దాదాపు నెలరోజుల నుంచి వేడుకలు చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లయినా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఓయువతి రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తుండగా.. యువకుడి కన్నుపడింది. బలంవంతగా ఆమెను తీసుకెళ్లి అత్యాచారంచేయడమే కాకుండా... న్యూడ్ వీడియోలతో బెదిరింపులకు పాల్పడ్డారు. చివరికి పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) కేంద్రం మచిలీపట్నం (Machilipatnam) కు చెందిన ఓ యువతి ఇటీవల రాత్రి పనిముగించుకొని ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో బైక్ పై వచ్చిన యువకులు.. ఆమెను అడ్రస్ అడిగినట్లు మాట్లాడారు. తాము పోలీసులమని మర్యాదగా బైక్ ఎక్కాలంటూ ఆమెను బెదిరించారు. అందుకు యువతి నిరాకరించడంతో బలవంతంగా తీసుకెళ్లిపోయారు.

చిలకలపూడి రైల్వే స్టేషన్ వెనుకున్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి యువతిపై అత్యాచారం చేశారు. అంతేకాదు ఆ ఘోరాన్ని వీడియోతి మొబైల్ ఫోన్ లాక్కున్నారు. జరిగినదాని గురించి ఎవరికైనా చెబితే న్యూడ్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఆ తర్వాత ఆమెను ఇంటికి పంపారు. ఐతే జరిగిన ఘోరాన్ని మౌనంగా భరిస్తూ ఇంటికెళ్లింది. ఐతే ఆ తర్వాత రోజు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డవారిలో ఓ యువకుడు తన ఇంటి ముందు నుంచే వెళ్తుండటాన్ని గుర్తింది. వెంటనే జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వారి సాయంతో ఆ యువకుడ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించింది. నిందితుడు సుకర్లాబాద్ చెందిన నారాయణగా గుర్తించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇది చదవండి: తల్లిని చూడకూడని స్థితిలో చూసిన కొడుకు.. అవమానం తట్టుకోలేక ఎంత పనిచేశాడంటే..


ఐతే కేసులో రెండో నిందితుడ్ని కూడా అరెస్ట్ చేయాలని బాధితురాలు పోలీసులను వేడుకుంది. ఐతే విచారణలో నిందితుడు ట్విస్ట్ ఇచ్చాడు. యువతిపై అత్యాచారానికి పాల్పడింది ఇద్దరు కాదని.. తాను ఒక్కడినే తీసుకెళ్లినట్లు అంగీకరించాడు. నిందితుడి దగ్గరున్న యువతి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించారు. అలాగే యువకుడి ఫోన్ తీసుకొని మొబైల్ డేటాతో పాటు ఘటన జరిగిన ప్రాంతంలో కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.

ఇది చదవండి: సమాధిలో శవం మిస్సింగ్.. దృశ్యం సినిమాను తలపిస్తున్న క్రైమ్ స్టోరీ..


ఘటనలో ఇద్దరున్నారా ఒకరున్నా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. యువతి మాత్రం తనపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారని చెబుతోంది. దీంతో నిందితుడు నారాయణను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితుడు ఆ యువతి పైనేనా.. మరికొందరిపై ఆఘాయిత్యాలకు పాల్పడ్డాడా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. కాల్ డేటా, ఫోన్ డేటా వివరాలు పూర్తిగా విశ్లేషిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయనిచ చెబుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Gang rape, Krishna District

ఉత్తమ కథలు