Anna Raghu, News18, Amaravati
ప్రస్తుతం పిల్లలు, టీనేజర్స్ నిత్యం మొబైల్ గేమ్స్ (Mobile Games) కు అతుక్కుపోతున్నారు. గంటలు, రోజుల తరబడి గేమ్స్ ఆడుతూనే ఉంటారు. ఈ విషయంలో పెద్దలు ఎంతచెప్పినా పిల్లలు అస్సలు పట్టించుకోరు. ఇలాంటి గేమ్స్ ఒక్కోసారి శ్రుతిమించి ప్రాణాలమీదకు కూడా తెస్తున్నాయి. గేమ్స్ కు బానిసలై ఆస్పత్రులపాలైన ఘటనలు ప్రతిరోజూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అలాంటి ఆన్ లైన్ గేమ్ ఓ బాలుడి ప్రాణాల్ని బలితీసుకుంది. చదువులో తప్పడంతో సూసైడ్ చేసుకునే వాళ్లను చూసుంటారుగానీ.. ఆటలో ఓడిపోయి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడు పబ్ జీ గేమ్ కు అడిక్ట్ అయ్యాడు. తిండి, నిద్ర మాని గేమ్ ఆడుతుండటంతో తల్లి పలుమార్లు మందలించింది.
అయినా తీరుమార్చుకోని బాలుడు ఆదివారం తెల్లవారు జాము వరకు నిద్రపోకుండా గేమ్ ఆడుతూనే ఉన్నాడు. గేమ్ లో ఓడిపోయాడు ఇంట్లో వాళ్ళు హేళన చేసారని తనువు చాలించాడు. కృష్ణా జిల్లా (Krishna District) కేంద్రమైన మచిలీపట్నం (Machilipatnam) లో ఈ విషాదం చోటుచేసుకుంది. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు (16) తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం రాత్రి ఇంట్లో వాళ్లతో కలిసి పబ్జి గేమ్ ఆడాడు. అయితే గేమ్‌లో ఓడిపోవడంతో ఇంట్లో వాళ్లు ప్రభును కాస్తా ఆటపట్టిస్తూ హేళన చేశారు.
దీంతో అవమానం తట్టుకోలేక వేరే గదిలో పడుకుంటానని చెప్పి ప్రభు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం ఎంత సేపటికి బయటకి రాకపోవడంతో నిద్ర లేపేందుకు తండ్రి తలుపులు తీయడంతో గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కొడుకు ఉరికి వేలాడుతూ కనిపించడంతో అది చూసిన తండ్రి సొమ్మసిల్లి పడిపోయాడు.తన కొడుకు లా ఎవరి కొడుకైన ఆన్లైన్ గేమ్ పబ్జీ ని ఆడేందుకు ఒప్పుకోవద్దని వారి బంగారు జీవితాలను చిదిమేస్తుందని చెప్పటం అందరిని కంటతడి పెట్టిస్తుంది.
గత కొన్ని రోజుల క్రితం పల్నాడు జిల్లా లో ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడుకుంటానికి ఫోన్ ఇవ్వలేదని ఒక ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళ పై తన ఏడవ తరగతి చదువుతున్న కొడుకు కర్రతో కొట్టటానికి రావటం తో మహిళ ఇంట్లో నుండి బయటకు వచ్చి కేకలు వేయగా ఇంటిపక్క వారు వచ్చి మహిళ పై కొడుకు దడి ని అపి పోలీస్ లకు కంప్లైన్ట్ ఇవ్వగా పిల్లవాని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్న పోలీస్ లు పిల్లవాణ్ణి మానసిక నిపుణుడు వద్దకు కౌన్సిలింగ్ కొరకు పంపించారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Krishna District, PUBG, Suicide