ఒక్కొసారి కష్టపడి చదివిన సీటు దొరకక .. వందల, వేలు, లక్షల్లో ఫీజులు కట్టి సీటు కొనుక్కుంటాము. మరికొన్ని సార్లు ఫ్రీగా సీటు వచ్చిన చేరలేని పరిస్థితి. ఎందుకంటే సరైన ఫ్యాకల్టీ లేకనో.. లేక తగినంత విద్యార్థులు లేక కొన్ని సీట్లు మిగిలిపోతాయి. ఒక్కోసారి కనీసం ఒక సీటుగా కూడా భర్తీకావు. ఇలా వందల కళాశాలలు మూసివేశారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే వచ్చింది కృష్ణా విశ్వవిద్యాలయం (Krishna University) లోని కొన్ని కోర్సులకు. విశ్వవిద్యాలయంలో సీటు రావాలంటే ఎంతో కష్టపడాలంటారు. అయితే ప్రస్తుతం యువత డిమాండ్ ఉన్న కోర్సులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో కొన్ని కోర్సుల్లో పూర్తిగా ఎవరు జాయిన్ అవకుండా మానేస్తున్నారు.
గత రెండు సంవత్సరాల్లో ఈ కృష్ణా వర్శీటిలో ఎంఏ జర్నలిజం కోర్సును మూసేశారు. ఇప్పుడు ఎంఏ తెలుగును కూడా మూసేశారు. అదే కోవలో ఇంగ్లీషు విభాగం కూడా ఉంది. నాలుగేళ్లుగా ఎంఏ ఇంగ్లీషు విభాగం నందు ఒకరిద్దరే చేరుతున్నారు. కామర్స్ లో అయితే ఎనిమిది మంది మాత్రమే చేరారు. ఫిజిక్స్ లో కూడా ఎవరు చేరటం లేదు. త్వరలో ఇవి కూడా మూతపడే అవకాశం ఉంది.
సాధారణంగా మిగతా అఫ్లీయేటేడ్ కళాశాల్లో ఈ కోర్సులుండటం చాలా తక్కువ. ఎక్కువ మంది యూనివర్శటికి వచ్చే ఈ కోర్సులను చదువుతారు. మరి ఎందుకు విద్యార్థులు ఈ కోర్సులకు దూరంగా ఉంటున్నారో తెలియటం లేదు. సరైన ఉపాధి అవకాశాలు లేకనా... లేక అవగాహనలోపమో తెలియటం లేదు. సంబంధింత డిపార్ట్ మెంటు ఫ్యాకల్టీ యాజమాన్యం ఈ కోర్సులపై సరైన అవగాహన కార్యక్రమాలు చేపట్టి.. విద్యార్థులను ఆ కోర్సుల్లో చేరేలా ప్రయత్నం చేయాల్సినవరం ఉంది.
మరి ముఖ్యంగా ఒకప్పుడు ఈ కృష్ణా యూనివర్శటిని 2008 మచిలీపట్నంలో అద్దె భవనాల్లో తరగతులను నిర్వహించే వారు. ఇప్పుడు... సొంతంగా ప్రాంగాణం ఏర్పాటు చేసుకుని చదువులు ప్రారంభించిన... సౌకర్యాల కొరత వెంటాడుతోంది. దీంతో విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరటం లేదు. గత మూడున్నర సంవత్సరాలుగా జీతాలకు తప్ప విశ్వవిద్యాలయం అభివృధ్దికి నోచుకోలేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు కేటాయించలేదు. దీంతో అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది. ఒకప్పడు విద్యార్థులతో కళకళలాడిన కళాశాల ఇప్పుడు విద్యార్థులు లేక వెలవెలబోతుంది.
మరి ముఖ్యంగా వసతి గృహాలు, క్యాంటీన్ లాంటి ప్రాథమిక వసతులు లేకపోవటంతే విద్యార్థులు చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తగినన్నీ నిధులు వెచ్చించి... యూనివర్శటి అభివృద్ధికి సహకరిస్తే... మరికొన్ని విభాగాలు మూతపడకుండా కాపాడుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Krishna District, Local News