కృష్ణాజిల్లా.. మచిలీపట్టణంలోని కామాక్షి జ్యుయలరీ షాపుకు ఫోన్ వచ్చింది. షాప్ యజమాని రిసీవ్ చేసుకున్నాడు. "నేను గవర్నమెంట్ డాక్టర్‌ని. మీ దగ్గర ఉన్న హారాల మోడల్స్ ఫొటోలు నా వాట్సాప్‌కి పంపండి. నాకు ఒకటి కావాలి" అని అవతలి నుంచి వాయిస్ వచ్చింది. మంచి బేరం తగులుతోంది అనుకున్న ఓనర్.. తన దగ్గర ఉన్న నాలుగు హారాల మోడల్స్ ఫొటోలు పంపాడు. వాటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు కేటుగాడు. "ఈ హారాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి నాకు ఇవ్వండి. వెంటనే మనీ ఇస్తాను" అన్నాడు.
షాప్ ఓనర్.. తన సిబ్బందితో కాకుండా.. తానే స్వయంగా వెళ్లి హారాన్ని ఇవ్వాలని అనుకున్నాడు. హారం తీసుకొని ఆస్పత్రికి వెళ్లాడు. అప్పటికే డ్రామా కంటిన్యూ చేసిన కేటుగాడు.. డాక్టర్ అవతారంలో దర్శనం ఇచ్చాడు. "ఎస్.. నేనే మీకు కాల్ చేశాను... రండి.. అంటూ అతన్ని ఓ డాక్టర్ రూం బయట నిలబెట్టాడు. మనీ తెస్తానని చెప్పి.. హారంతో సహా ఆ డాక్టర్ గదిలోకి వెళ్లాడు. తిరిగి రాలేదు.
ఎంతకీ రాకపోవడంతో ఆ షాప్ ఓనర్.. డాక్టర్ గదిలోకి వెళ్లి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. ఆ పక్కన ఓ కిటికీ తెరచి ఉంది. కేటుగాడు.. కిటికీ నుంచి దూకి పారిపోయాడు. అలా హారం ఎత్తుకుపోయాడు.
అతనో దొంగ అనీ.. అలాంటి డాక్టరే అక్కడ లేరని తెలియడంతో... షాప్ ఓనర్ అవాక్కయ్యాడు. ఇలా కూడా మోసాలు చేస్తున్నారా అనుకుంటూ.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కేసు రాయించిన ఆర్ పేట సీఐ రవికుమార్.. దర్యాప్తుచేసి దొంగను పట్టుకుంటామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh