హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MLA Vamsi: గన్నవరంలో అక్రమ మైనింగ్.. అసలు నిజం ఇదే..! ఎమ్మెల్యే వంశీ సంచలన కామెంట్స్

MLA Vamsi: గన్నవరంలో అక్రమ మైనింగ్.. అసలు నిజం ఇదే..! ఎమ్మెల్యే వంశీ సంచలన కామెంట్స్

వల్లభనేని వంశీ (ఫైల్)

వల్లభనేని వంశీ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కృష్ణా జిల్లా (Krishna District) గన్నవరం (Gannavaram) ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. తాజాగా అక్రమ మైనింగ్ అంశంలో మరోసారి గన్నవరంతో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (MLA Vallabhaneni Vamsi Mohan) వార్తల్లోకి వచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Machilipatnam, India

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కృష్ణా జిల్లా (Krishna District) గన్నవరం (Gannavaram) ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. తాజాగా అక్రమ మైనింగ్ అంశంలో మరోసారి గన్నవరంతో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (MLA Vallabhaneni Vamsi Mohan) వార్తల్లోకి వచ్చారు. గన్నవరంలో మైనింగ్ విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలివ్వడంతో ఎమ్మెల్యే వంశీ స్పందించారు. గన్నవరంలో ఎటువంటి అక్రమ మైనింగ్ తవ్వకాలు జరగడం లేదని వంశీ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో దీర్ఘ కాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ వల్లభనేనిన వంశీ.. మచిలీపట్నంలో కలెక్టర్ పి.రంజిత్ కలిసి వినతి పత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఎయిర్ పోర్టు విస్తరణ పనులకు అవసరమైన మట్టి, రాళ్లను గన్నవరం పరిసరాల్లోని కొండ ప్రాంతాల నుండే రవాణా జరుగుతోందన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో ఎవరి జోక్యం ఉండదని వంశీ తెలిపారు.. ఇదే విషయాన్ని గతంలోనూ చెప్పానని గుర్తుచేశారు. బ్రహ్మలింగయ్య చెరువులో ఆర్గానిక్ చేపలు పెరుగుతున్నాయని.. అలాంటి చెరువును తవ్వేస్తున్నారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు, అమరావతి రైతుల పాదయాత్రలో Jr.NTRని తిట్టడం లాంటి అంశాలపై కూడా వంశీ స్పందించారు.

ఇది చదవండి: అన్‌స్టాపబుల్‌లో అమరావతి.. అప్పుడు బాహుబలి రాలేదు కాబట్టి సరిపోయింది..?

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ప్రభుత్వ నిర్ణయమని.. ఎన్టీఆర్ పేరును తీసివేసినంత మాత్రాన ఆయనకున్న గౌరవం తగ్గదని, YSR పేరు పెట్టడం వల్ల ఆయనకున్న ఖ్యాతి పెరిగేదేమీ ఉండదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఇది కేవలం రెండు రాజకీయ పార్టీల మధ్య నడుస్తున్న వివాదం అని కొట్టి పడేశారు.

ఇది చదవండి: ఏపీలోని ఆ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. నెలకు రూ.20వేలు జీతం

అమరావతి విషయంలో ఏ మాత్రం సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) ని దూషించడం సరికాదన్నారు. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) చెబితేనే రాజధానికి భూములు ఇచ్చారా..? అంటూ ప్రశ్నించారు. స్వయం కృషితో ఎదిగిన వ్యక్తిని.. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఓ కరివేపాకులా వాడుకుని వదిలేశారని విమర్శించారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తర్వాత వంశీ సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరిగింది. ఆయన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారంటూ వార్తలు వచ్చాయి. ఐతే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ మైనింగ్ తో పాటు ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపైనా నేరుగా స్పందించి క్లారిటీ ఇచ్చారు వల్లభనేని వంశీ. గతంలో ఇదే అంశంపై ట్విట్టర్ ద్వారా సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసందే.

First published:

Tags: Andhra Pradesh, Krishna District, Local News, Vallabhaneni Vamshi

ఉత్తమ కథలు