హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Machilipatnam: ప్లాన్ రివర్స్.. లిక్విడ్ గంజాయి బ్యాచ్ అడ్డంగా దొరికిపోయింది

Machilipatnam: ప్లాన్ రివర్స్.. లిక్విడ్ గంజాయి బ్యాచ్ అడ్డంగా దొరికిపోయింది

liquid Marijuana

liquid Marijuana

కృష్ణా జిల్లాలో గంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది. పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి అక్రమంగా తరలిస్తున్న సరుకును పట్టుకుని సీజ్ చేస్తున్నారు. తరలిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా మచిలీపట్నంna ఇదే తరహాలో లిక్విడ్ గంజాయి ముఠాను ప

ఇంకా చదవండి ...
  • Local News Desk
  • Last Updated :
  • Vijayawada, India

కృష్ణా జిల్లాలో గంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది. పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి అక్రమంగా తరలిస్తున్న సరుకును పట్టుకుని సీజ్ చేస్తున్నారు. తరలిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా మచిలీపట్నంna ఇదే తరహాలో లిక్విడ్ గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

కృష్ణా జిల్లా పోలీసులు లిక్విడ్ గంజాయి బ్యాచ్ చేతులకు సంకెళ్లు వేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. కేసుకు సంబంధించిన పూర్వాపరాలను జిల్లా ఎస్పీ పి.జాషువా మీడియాకు వివరించారు.

విశాఖపట్నానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. బెంగుళూరుకు చెందిన మరో వ్యక్తి నలుగురు కలిసి ఓ ముఠా ఫామ్ చేశారు. ఈ ముఠా.. గంజాయిని లిక్విడ్ మార్చి ఎలా అక్రమంగా తరలించాలన్నదానిపై బాగానే స్టడీ చేసింది. లిక్విడ్ గంజాయిని బెంగళూరు పరిసర ప్రాంతాలకు సరఫరా చేసి అక్రమంగా డబ్బు సంపాదించాలని డిసైడయ్యారు. ఎప్పటినుంచి గంజాయిను గుట్టుచప్పుడు కాకుండా తెలియదు కానీ.. వీరికి బ్యాడ్ టైం దగ్గరపడటంతో ఖాకీలకు దొరికిపోయారు. లిక్విడ్ గా మార్చి బెంగుళూరు పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తున్న క్రమంలో పోలీసులు వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

విశాఖ ఏజెన్సీ నుంచి విజయవాడ మీదుగా.. కర్ణాటక రాజధానికి తరలించాలనేది ఈ గంజాయి గ్యాంగ్ ప్లాన్. ప్లాన్ ప్రకారం.. 18కేజీల గంజాయిని 3.8కేజీల లిక్విడ్ గంజాయిగా మార్చేశారు. ఈ లిక్విడ్ గాంజాను తీసుకెళ్తూ.. హనుమాన్ జంక్షన్ పొట్టపాడు టోల్ గేట్ వద్ద గస్తీ కాస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కూపీ లాగి, వాళ్ల ప్లాన్ మొత్తం రివర్స్ చేసేశారు. వీరితో అంటకాగుతున్న ఇతరుల వివరాలను కూడా తెలుసుకుని వాళ్లను కూడా పట్టుకునే పనిలో ఉన్నామని ఎస్పీ జాషువా తెలిపారు.

గతంలో ఈ నలుగురిపై అనేక కేసులు ఉన్నాయని ఎస్పీ జాషువా తెలిపారు. నిందితులు గతంలోనూ గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారని గుర్తుచేశారు. నిందితులపై ఇప్పటికే NDPS కేసులు, రౌడీషీట్ లు తెరిచి ఉన్నాయన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో విశేష కృషి చేసిన హనుమాన్ జంక్షన్ సీఐ నవీన్ నరసింహమూర్తి, ఆత్కూరు ఎస్ఐ, మరో ఇద్దరు కానిస్టేబుల్స్ కు రివార్డులు అందజేశారు ఎస్పీ జాషువా.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు