హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పక్కింటికి భోజనానికి వెళ్లాడని కోపం.. ఏడేళ్ల కుమారుడిపై తండ్రి కర్కశత్వం

పక్కింటికి భోజనానికి వెళ్లాడని కోపం.. ఏడేళ్ల కుమారుడిపై తండ్రి కర్కశత్వం

మచిలీపట్నంలో చిన్నారికి వాతలుపెట్టినతండ్రి

మచిలీపట్నంలో చిన్నారికి వాతలుపెట్టినతండ్రి

Machilipatnam: కోపం అందరికీ వస్తుంది.. కొన్నిసార్లు కోపం కట్టలు తెంచుకొని ఏం చేస్తున్నారో తెలియకుండా ఘోరాలకు పాల్పడుతుంటారు. కన్నకొడుకు తను గిట్టనివాళ్లించికి వెళ్లాడన్న ఆగ్రహంతో ఊగిపోయిన ఓ తండ్రి.. పసివాడికి కఠిన శిక్ష వేశాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Machilipatnam, India

కోపం అందరికీ వస్తుంది.. కొన్నిసార్లు కోపం కట్టలు తెంచుకొని ఏం చేస్తున్నారో తెలియకుండా ఘోరాలకు పాల్పడుతుంటారు. కన్నకొడుకు తను గిట్టనివాళ్లించికి వెళ్లాడన్న ఆగ్రహంతో ఊగిపోయిన ఓ తండ్రి.. పసివాడికి కఠిన శిక్ష వేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా (Krishna District) కేంద్రమైన మచిలీపట్నం (Machilipatnam) లోని సర్కారు తోటకు చెందిన దుర్గారావు ముఠాపని చేస్తూ భార్యబిడ్డలను పోషించుకుంటున్నాడు. మంగళవారం తన ఇంటికి సమీపంలోని ఓ ఇంట్లో వర్ధంతి కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో దుర్గారావు కుమారుడు ఏడేళ్ల జగదీష్.. స్నేహితులతో కలిసి ఆడుకుంటూ అక్కడికెళ్లి భోజనం చేశాడు. ఐతే ఆ కుటుంబానికి దుర్గారావు కుటుంబానికి మాటల్లేవు. తనకు ఇష్టంలేని వారింటికి భోజనానికి వెళ్లాడన్న కోపంతో ఊగిపోయిన దుర్గాగావు.. చిన్నారి జగదీష్ ను ఇష్టమొచ్చినట్లు కొట్టాడు.

అయినా కోపం చల్లారకపోవడంతో అట్లకాడ కాల్చి కాళ్లపై వాతలుపెట్టాడు. దీంతో బాలుడు బాధతో అల్లాడిపోయాడు. బాలుడి ఏడుపు విన్న చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. క్షణికావేశంలోనే కొడుకుపట్ల కర్కశంగా ప్రవర్తించినట్లు దుర్గారావు అంగీకరించాడు.

ఇది చదవండి: పక్కింటి కుర్రాడితో బాలిక స్నేహం.. ఆరు నెలల తర్వాత షాకింగ్ సీన్

ఐతే అభం శుభం తెలియని పిల్లాడి చేష్టలకు ఇంతలా కోపగించుకోవాలా అని పలువురు మండిపడుతున్నాడు. పెద్దవాళ్ల మధ్య జరిగిన గొడువలకు చిన్నపిల్లలేం చేస్తారని చెబుతున్నారు. మరి పోలీసులు దుర్గారావుపై కేసు నమోదు చేశారా..? లేక మందలించి పంపేశారా అనేది తెలియాల్సి ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Local News, Machilipatnam

ఉత్తమ కథలు