హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా.. ఏ పార్టీలో చేరుతున్నారంటే..?

Breaking News: బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా.. ఏ పార్టీలో చేరుతున్నారంటే..?

కన్నా లక్ష్మీనారాయణ (ఫైల్ ఫోటో)

కన్నా లక్ష్మీనారాయణ (ఫైల్ ఫోటో)

Breaking News: భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. బీజేపీకి రాజీనామా చేశారు.. ఏ పార్టీలో చేరాలి అన్నదానిపై కార్యకర్తలతో చర్చిస్తున్నారు. కాసేపట్లో దానిపై ఆయన అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Breaking News:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)  బీజేపీ (BJP)కి బిగ్ షాక్..  సీనియర్ నేత.. మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ (Kan na Lakshmi Narayana) రాజీనామా చేశారు. తాజాగా తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే బీజేపీ కి రాజీనామా చేసినట్టు ప్రకటించారు.  కార్యకర్తల సూచనలు.. సలహాలు తీసుకున్న తరువాత.. పూర్తిగా వారితో చర్చింది.. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు.  అయితే ఏ పార్టీలో చేరాలి అన్నదానిపై  ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అటు టీడీపీ, జనసేన నేతలతో పూర్తి చర్చల తరువాత.. ఆయన జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి అనుచరులు సూచన తరువాత ఆయన అధికారికంగా నిర్ణయం ప్రకటించనున్నారు.

గత కొంతకాలంగా బీజేపీకి దూరంగానే ఉంటున్నారు కన్నా లక్ష్మీ నారాయణ.. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఎంపీ జీవీఎల్  తీరుపై గుర్రుగా ఉన్నారు.  ఈ మధ్య ఆయన నేరుగా బీజేపీ ఎంపీ.. కీలక నేత జీవీఎల్ నరసింహంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపులకు ఏం చేశారని.. జీవీఎల్ కు సన్మానం చేశారని ప్రశ్నించారు.

చాలాకాలంగా కన్నా.. పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారు. అదే సమంలో లక్ష్మీనారాయణతో జనసేన పీఏసీ చైర్మన్, ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌ Nadendla Manohar) భేటీ అయ్యారు. అప్పుడే ఆయన జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఎన్నికలకు అప్పటికీ ఇంకా సమయం ఉండడం.. టీడీపీ , జనసేన పొత్తుపై క్లారిటీ రాకపోవడంతో అప్పటికి నిర్ణయం వాయిదా వేసుకున్నారని అనుచరులు చెబుతున్న మాట..

ఇదీ చదవండి : డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి కొడాలి నాని .. ఆర్టీసీ బస్సు ఎలా నడిపారో చూడండి..

ఇప్పటికే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడం.. ఇక బీజేపీలో ఇమడలేకపోయిన పరిస్థితి ఉండడంతో.. త్వరగా నిర్ణయం తీసుకోవడమే మంచిందని ఫిక్స్ అయ్యారని అయన అనుచరులు చెబుతున్నారు. జనసేన నుంచి సత్తెనపల్లి లేద గుంటూరులో ఒకచోటు నుంచి సీటు ఫిక్స్ అయ్యింది అంటున్నారు.

ఇదీ చదవండి : వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ.. శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర.. ప్రత్యేకత ఇదే..?

మరోవైపు కన్నాకు టీడీపీ తలుపులు కూడా తెరుచుకునే ఉన్నాయి. సత్తెనపల్లి సీటు ఇచ్చేందుకు టీడీపీ అధినాయకత్వం కూడా సిద్ధమైందని ప్రచారం ఉంది. దీంతో మరి కన్నా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అనుచరులు మాత్రం.. జనసేన కన్నా.. టీడీపీలో చేరితేనే రాజకీయంగా లబ్ధి ఉంటుందని సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా  తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానని అనుచరులకు చెప్పినట్టు ప్రచారం ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Ap bjp, AP News, Janasena party, Kanna laxminarayana

ఉత్తమ కథలు