Home /News /andhra-pradesh /

MACHARLA UNDER POLITICAL HEAT AFTER TDP LEADER CHANDRAIAH MURDER AS TDP LEADERS MADE ALLEGATIONS ON YCP FULL DETAILS HERE PRN GNT

AP Politics: పల్నాడులో భగ్గుమన్న హత్యారాజకీయాలు.., వైసీపీని ఇరుకునపెట్టేపనిలో టీడీపీ..

ఫల్నాడులో వేడెక్కిన రాజకీయం

ఫల్నాడులో వేడెక్కిన రాజకీయం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని గుంటూరు జిల్లా (Guntur District) లోని పల్నాడు ప్రాంతం పగలకు ప్రతీకారాలకు పెట్టింది పేరు. తాజాగా మాచర్లలో టీడీపీ నేత హత్య ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోస్తోంది.

  Anna Raghu, Guntur, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని గుంటూరు జిల్లా (Guntur District) లోని పల్నాడు ప్రాంతం పగలకు ప్రతీకారాలకూ పెట్టింది పేరు. నలగామరాజు ,మలిదేవరాజు అనే ఇద్దరు దాయాది సోదర రాజుల మధ్య వైరం వారి మంత్రులైన పల్నాటి బ్రహ్మనాయుడు,నాగమ్మ వంటి వారి పంతంతో "పలనాటి యుద్ధం" కి దారితీసిన చరిత్ర ఈ ప్రాంతానిది.ఇది 14వ శతాబ్దం నాటి చరిత్ర.శతాబ్దాలు మారినా అక్కిడి ప్రజలలో పౌరుషం, పంతాలు, పట్టింపులు ,వంటి జాడ్యం ఇంకా వదలలేదు అనేలా ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తుండటం ఒకింత ఆశ్ఛర్యాన్ని కలుగ చేస్తుందనే చెప్పాలి. తరాలు మారినా పలనాడు ప్రాంతంలో ప్రజలలో నిరక్షరాస్యత మరియు ఆ ప్రాంత రాజకీయ నాయకుల స్వార్ధం పలనాట ఫ్యాక్షనిజాన్ని నివురుగప్పిన నిప్పులా సజీవంగా ఉంచిందనే చెప్పాలి.

  శతాబ్దాల తరబడి పలనాడు ప్రాంతంలో రకరకాల కారణాల తో ఏదో ఒకచోట హత్యలు ఎప్పుడోకప్పుడు షత్యలు జరుగుతూనే ఉన్నాయి.ఐతే రాజకీయ పార్టీలు వీరిని పావులుగా వాడుకోవడంతో ఆప్రాంతంలో ఫ్యాక్షన్ గొడవలు పురుడుపోసుకున్నాయి.అలా జరిగిన ఫ్యాక్షన్ హత్యలలో ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబాలు తమ కుటుంబసభ్యులను కోల్పోవడమే కాక ఎంతో మంది వారి అనుచరులు ప్రాణాలు కోల్పోయారు.

  ఇది చదవండి: సీఎం జగన్ తో చిరంజీవి భేటీపై రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు.. జగన్ కేసులతో లింక్ పెట్టిన రాజుగారు


  ఇక ఈరోజు వెల్దుర్తి మండలం గుండ్లపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోట.చంద్రయ్య హత్య వెనుక ఫ్యాక్షన్ రాజకీయాల ప్రభావం స్పష్టంగాకనిపిస్తుంది.ఈ హత్యలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మృతుడు చంద్రయ్య ఇటీవల మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన జూలకంటి.బ్రహ్మారెడ్డి ప్రధాన అనుచరుడు. గత డిశెంబర్ నెల లో జూలకంటి బ్రహ్మారెడ్డి ని ఇన్ ఛార్జ్ గా ప్రకటించిన నాటి నుండి మాచర్ల తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులలో కొంత ఉత్తేజం నెలకొందని.., గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యక్రమాలు ఊపందుకున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. పైగా 2001లో జూలకంటి బ్రహ్మారెడ్డి తన బాబాయ్ జూలకంటి. హనిమిరెడ్డి హత్యకేసులో నిందితులైన ఏడుగురు(7)కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లారీతో గుద్దించి చంపించాడనే ఆరోపణలతో అతనిపై హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. అప్పటికే అతని తల్లి జూలకంటి దుర్గాంబ మాచర్ల శాసనసభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తరువాతి కాలంలో హత్యకేసు కొట్టివేయడంతో బ్రహ్మారెడ్డి కుటుంబం మాచర్ల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

  ఇది చదవండి: వైసీపీకి షాకిచ్చేలా రఘురామ వ్యూహం.. ఇతర పార్టీలదీ అదే పరిస్థితి.. అందుకే ఆ నినాదమా..?


  గడచిన రెండు దశాబ్దాలుగా మాచర్ల టీడీపీలో సరైన నాయకత్వం లేక పోవడంతో చంద్రయ్య వంటి కొందరు నేతలు బ్రహ్మారెడ్డిని ఒప్పించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి వద్ద తమ దుస్థితిని వివరించి బ్రహ్మారెడ్డిని మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ గా తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించారనేది స్థానికంగా ప్రచారంలో ఉంది. బ్రహ్మారెడ్డి రాకతో మాచర్ల నిపయోజకవర్గంలో టీడీపీ బలపడటం తట్టుకోలేక వైసీపీ వారు ఎలాగైనా నియోజకవర్గంలో టీడీపీ వర్గీయులను భయభ్రాంతులకు గురిచేయాలనే పన్నాగంలో భాగంగానే తోట చంద్రయ్య ను కిరాతకంగా హత్య చేసినట్లు తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.

  ఇది చదవండి: ఎన్టీఆర్ కంటే పవన్ కే ఓటేసిన చంద్రబాబు.. టీడీపీ పొలిటికల్ గేమ్ ప్లాన్ ఇదేనా..?


  ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళు సమయం ఉండగానే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రానున్నరోజుల్లో పల్నాడులో ఇంకెన్నిహత్యలు జరుగుతాయో,ఎంతమంది ఊళ్ళు వదిలి పారిపోతారోనని అక్కడి ప్రజలు ఆందోళణ చెందుతున్నారు.ఇప్పటికే చాలా గ్రామాలలో తెదేపా వారు తమ ఇళ్ళూ, ఆస్థులు వదిలిపెట్టి ఎక్కడెక్కడో బ్రతుకుతున్నారని,ఇలాంటి హత్యఘటనలు చోటుచేసుకుంటే రానున్నరోజులలో ఇక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని,చంద్రయ్య హత్యకేసు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి చంద్రయ్యకు నివాళులర్పించడం.. ఆయన పాడెను స్వయంగా మోయడంతో మాచర్ల రాజకీయం మరింత వేడెక్కింది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Tdp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు