హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MAA Politics: మా ఎన్నికల్లో రాజకీయ పార్టీల హస్తం నిజమేనా… వారి ప్రకటనల్లో నిజమెంత..?

MAA Politics: మా ఎన్నికల్లో రాజకీయ పార్టీల హస్తం నిజమేనా… వారి ప్రకటనల్లో నిజమెంత..?

7. ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా ఇండియాలోని అన్ని చోట్లకు విష్ణు ప్యానెల్ సభ్యులు వెళ్లారు.. వాళ్లు వచ్చి ఓటేసేలా చేసారు..

7. ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా ఇండియాలోని అన్ని చోట్లకు విష్ణు ప్యానెల్ సభ్యులు వెళ్లారు.. వాళ్లు వచ్చి ఓటేసేలా చేసారు..

MAA Elections: ఇక తాజాగా మా ఎన్నికల వేడి మొదలైన నాటి నుంచి కొందరు నటుల మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. ఒకరిపై మరొకరు రాజకీయ నాయకులకన్నా మేమేం తీసిపోమంటూ బహిరంగ దూషణలకు దిగేస్తున్నారు.

  M.Bala Krishna, Hyderabad, News18

  చిత్ర పరిశ్రమలో (Cinema Industry) తమకంటూ ఓ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకున్నారు కళాకారులు. ఇందుకు రెండేళ్ళకు ఒక ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారు. మా  అసోసియేషన్ (MAA) కు మొత్తం కలిపి 1400 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. మా అసోసియేషన్ లో చేరేందుకు ఈ సభ్యులంతా అక్షరాలా లక్ష రూపాయలు చెల్లించుకున్న వాళ్లే. వీళ్లలో తమ టాలెంట్ తో పైకి వచ్చిన వారు కొందరు అయితే.., వారసులు మరికొందరు. ట్యాలెంట్ ఉన్నవాళ్లే స్టార్లు అవుతారనేది.. అక్షరాలా నిజం. ఈ పరిశ్రమలో అణగతొక్కడం, పైకి లేపటం అనే వాటి గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సాధారణ రోజుల్లో తామంతా కళామతల్లి ముద్దబిడ్డలం అని చెప్పుకునే సినిమా స్టార్లు.. మా ఎన్నికలు (MAA Elections-2021) వచ్చేసరికి వర్గాలుగా విడిపోతున్నారు. రాజకీయ నాయకుల స్థాయిలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

  అసలు మాలో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి..? ఎన్నికల పేరుతో ఇంత రచ్చ అవసరమా..? మా లో సభ్యత్వం పొందని వారి మనోభావాలు ఏంటి...? ఎంతమంది ఆర్టిస్టులకు నిజంగా సహాయ సహకారాలు అందుతున్నాయి..? అనేది ప్రశ్నలకు ఎవరూ సమాధానాలు చెప్పరు. ఇదిలా ఉంటే ఎన్నికలు వస్తే కష్టాల్లో ఉన్న ఆర్టిస్టులెవరూ కనిపించరు..? వాళ్లకు నాలుగు సినిమాల్లే వేషాలు వస్తే చాలు కడుపు నిండుతుంది అనే భావన తప్ప ఇలాంటి వాటి జోలికి రారు.

  ఇది చదవండి: సాయితేజ్ రిపబ్లిక్ సినిమాపై వివాదం.., కోర్టుకు వెళ్తామని హెచ్చరిక.. అసలేం జరిగిందంటే..!


  ఇక కరోనా సమయంలో సినిమాలు లేక ఆదాయం రాక కష్టాల్లో ఉన్న సినీ కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) సీసీసీని ఏర్పాటు చేసి తనతో పాటు మరికొందరి సహాయ సహకారాలు తీసుకోని నిత్యావసరాలను అందించారు. అప్పుడు మా అసోసియేషన్ వల్ల పేద కార్మికులకు ఒరిగిందేమీ లేదు. కష్టాల్లో ఉన్న సమయంలో వారికి సహాయపడాలన్న ఆలోచనలో 10 శాతం అయినా ఆచరణలోకి వస్తే బాగుండేదనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది.

  ఇది చదవండి: జనసేనలోకి ఇద్దరు మాజీ మంత్రులు.. ఒక మాజీ ఎమ్మెల్యే..? పవన్ స్ట్రాటజీ ఇదేనా..?


  ఇక తాజాగా మా ఎన్నికల వేడి మొదలైన నాటి నుంచి కొందరు నటుల మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. ఒకరిపై మరొకరు రాజకీయ నాయకులకన్నా మేమేం తీసిపోమంటూ బహిరంగ దూషణలకు దిగేస్తున్నారు. ఇవన్నీ చూసే ప్రజలకు చికాకులు మాత్రం తప్పడం లేదు. అయితే ఉన్న రెండు వర్గాలు ఎన్నికల్లో విజయం మాదంటే మాదంటూ బల్లగుద్ది చెప్తున్నాయి. మా వెంట ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) ఉన్నారంటూ మంచు విష్ణు వర్గీయులు (Manchu Vishnu Panel) ప్రకటనలు చేసేస్తుంటే... మా వెంట మెగాస్టార్ ఉన్నారని ప్రకాష్ రాజ్ ప్యానెల్ (Prakash Raj Panel) చెప్పేసుకుంటోంది.

  ఇదిలా ఉంటే మా ఎన్నికల్లో జోక్యం చేసుకునేంత టైమ్ మాకు లేదని ఏపీ మంత్రి పేర్ని నాని తేల్చేశారు. తెలంగాణలోని అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ గాని, సినిమాటోగ్రఫీ మంత్రిగానీ ఈ వ్యవహారానికి దూరంగానే ఉన్నారు. మరి 1500 మంది కూడా లేని అసోసియేషన్ ఎన్నికలకు పార్టీలు, ముఖ్యమంత్రుల పేర్లు వాడటం, బహిరంగంగా తిట్టుకోవడం రీల్ లైఫ్ గురించి రియల్ గా సాగుతున్న సినిమా జనం చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ క్లైమాక్స్ లో ఉన్న మా ఎలక్షన్ సినిమాలో ఇంకెన్ని ట్విస్టులు, ఫైటింగ్స్ ఉంటాయో వేచి చూడాలి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, MAA Elections, Telangana, Tollywood

  ఉత్తమ కథలు