Home /News /andhra-pradesh /

LOW PRESSURE WILL BE FORMED IN NORTH BAY OF BENGAL ON AUGUST 19TH UMG

Weather Alert: ఏపీకి మరో ముప్పు.. రేపు బంగాళఖాతంలో మరో అల్పపీడనం

బంగాళఖాతంలో మరో అల్పపీడనం

బంగాళఖాతంలో మరో అల్పపీడనం

తెలుగు రాష్ట్రాలకు (Telugu States) మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే రెండు సార్లు అల్పపీడన (Low Pressure) ప్రభావం ఆంధ్ర, తెలంగాణపై చూపించగా.. రేపు మరో అల్పపీడనం నమోదు కానుంది. బంగాళాఖాతం (Bay Of Bengal)లో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతారణ శాఖ తెలిపింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India
    తెలుగు రాష్ట్రాలకు (Telugu States) మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే రెండు సార్లు అల్పపీడన (Low Pressure) ప్రభావం ఆంధ్ర, తెలంగాణపై చూపించగా.. రేపు మరో అల్పపీడనం నమోదు కానుంది. బంగాళాఖాతం (Bay Of Bengal)లో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతారణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఇప్పటి వరకు ఏర్పడిన అల్పపీడనాలతో అంత ఇబ్బంది లేకున్నా.. రేపు ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఇరు తెలుగు రాష్ట్రాలపై ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

    అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తు్న్నాయని.. వీటి ప్రభావంతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ సూచించింది.

    ఇదీ చదవండి: చీర కొనలేదని.. చున్నీతో ఉరేసుకున్న భార్య.. చివర్లో ట్విస్ట్..!


    తాజాగా 12వ తేదీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వర్షాలు నమోదుకాకపోయినా.. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి, కృష్ణ నదులకు వరదలు పోటెత్తాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు.

    ఇక, అల్పపీడనం ప్రభావంతో కురిసన వర్షాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్, కాళేశ్వరం, జూరాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీశైలానికి వరద పోటెత్తడంతో అధికారులు లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

    ఇదీ చదవండి: ఏసీ బోగీల్లో పాడు పనులు.. రాత్రిళ్లు ఆడవాళ్లు పడుకున్న తర్వాత.. సైలెంట్‌గా పని కానిచ్చేస్తారు..!


    మరోవైపు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి బుధవారం రాత్రికి 15,12,848 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోందని అధికారులు తెలిపారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 3,17,250 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది.



    గోదావరి నదితో పాటు శబరి కూడా ఉగ్రరూపం దాల్చడంతో విలీన ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. భద్రాచలం వద్ద ప్రమాద స్థాయిలో గోదావరి నది ప్రవహిస్తోంది. ముఖ్యమంగా ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లోకి వరద నీరు చేరుతోంది. ఇప్పటికే భద్రాచలంతో పాటు ఇతర మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటిమట్టం 34,200 మీటర్లకు చేరింది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 12,36,429 క్యూసెక్కుల వరద నీరు కిందికి వెళుతోంది. రేపు ఏర్పడే అల్పపీడనం ప్రభావం ఇరు తెలుగు రాష్ట్రాలపై గట్టిగా చూపిస్తే వరద తప్పదని అధికారులు అప్రమత్తమయ్యారు.
    Published by:Mahesh
    First published:

    Tags: Andhra Pradesh Weather, Rains, Telangana Weather, Weather report

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు