స్థిరంగా అల్పపీడనం... ఏపీ, తెలంగాణకి వర్ష సూచన...

దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

ఒక్క అల్పపీడనం నాలుగు రాష్ట్రాలకు టెన్షన్ తెప్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.

 • Share this:
  మండే ఎండల్లో వర్షాలు పడితే... ప్రమాదమే. భూమిలో వేడి ఆవిరి పైకి వచ్చి... ఉక్కపోత ఎక్కువై ప్రజల ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.... దక్షిణ అండమాన్‌ సముద్ర పరిసరాల్లో స్థిరంగా ఉంది. ఓ నాలుగు రోజులు అక్కడే ఉండి... తర్వాత బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే సమయంలో బీహార్‌ నుంచి మధ్యప్రదేశ్‌, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ఉపరితలద్రోణి ఉంది. దీని వల్ల రాయలసీమ, కోస్తాల్లో కొన్ని చోట్ల వానలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

  మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి.  మంగళవారం కర్నూలు, తిరుపతి, అనంతపురంలలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో 45 డిగ్రీల దాకా వేడి పెరుగుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఆల్రెడీ నిజామాబాద్ జిల్లాలో 45 డిగ్రీలు నమోదవుతున్నాయి కూడా. రాత్రి వేళ కూడా 30 డిగ్రీల దాకా వేడి ఉంటుందంటున్నారు. తెలంగాణలో బుధవారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, గాలులతో వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు.

  నిజానికి మే 8 నాటికి అల్పపీడనం తుఫానుగా మారేదే. అందుకే దానికి ఎంఫాన్ అనే పేరు పెట్టారు కూడా. తీరా ఏపీలో తేమ లేకపోవడంతో... అల్పపీడనం మరింత బలపడే ఛాన్స్ లేకుండా పోయింది. అందువల్ల అది అల్పంగానే ఉంటుందని అంటున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: