బంగాళఖాతంలో మరో అల్పపీడనం... ఏపీ, తెలంగాణలో వర్షాలు

వచ్చే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దేశంలో ఈ ఏడాది ఇప్పటికే సాధారణం కన్నా ఏడు శాతం ఎక్కువగా వర్షం కురిసింది.

news18-telugu
Updated: September 28, 2019, 8:41 AM IST
బంగాళఖాతంలో మరో అల్పపీడనం... ఏపీ, తెలంగాణలో వర్షాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. బంగాళఖాతం దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆ ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వచ్చే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దేశంలో ఈ ఏడాది ఇప్పటికే సాధారణం కన్నా ఏడు శాతం ఎక్కువగా వర్షం కురిసింది. ఈ నెలాఖరు వరకు వర్షాలు కొనసాగే ఉన్నందున సాధారణం కన్నా అధిక వర్షపాతం రికార్డు కావచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది.

గత కొన్ని రోజులుగా ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వాగులు వంకలు, నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. వరద ఉధ‌‌ృతికి మరోసారి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేశారు. మహబూబ్ నగర్ జూరాల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. ఇవాళ కూడా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
First published: September 28, 2019, 8:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading