వాయుగుండంగా మారనున్న అల్పపీడనం... ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

news18-telugu
Updated: October 23, 2019, 8:39 AM IST
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం... ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 23, 2019, 8:39 AM IST
బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమమధ్య బంగాళఖాతానికి అనుకొని ఉన్న నైరుతి బంగాళఖాతంలో అల్పపీడనం బలపడింది.రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారి కోస్తావైపు పయనించనుంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి 45 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర,  కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందన్నారు. కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రాయలసీమ జిల్లాల్లో ఒక తేలికపాటి నుంచి ఒక మోస్తరు  వర్షాలు కురిసే అవకాశాలున్నారు.

ఈరోజు  గుంటూరు,  కృష్ణా,  ఉభయ గోదావరి జిల్లాలు,  విశాఖపట్నం,  విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవాకశముందని వాతావరణ శాఖ పేర్కొంది. నెల్లూరు,  ప్రకాశం,  కడప,  చిత్తూరు,  కర్నూలు,  అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాలతో వాగులు,  వంకలు,  నదుల్లో భారీగా వర్షపు నీరు చురుతోంది. ప్రజలు వాగులు,  నదులు దాటకుండా జాగ్రత్తలు పాటించాలని అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇటు తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో మంగళవారం నుంచి వానలు పడుతున్నాయి. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...