AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక, ఈ జిల్లాల్లో అధికం

అక్టోబర్ 19వ తేదీన మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది తదుపరి 24 గంటలలో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉన్నది.

news18-telugu
Updated: October 17, 2020, 5:12 PM IST
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక, ఈ జిల్లాల్లో అధికం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దక్షిణ కోస్తాఆంధ్రకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 km ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సుమారుగా అక్టోబర్ 19వ తేదీన మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది తదుపరి 24 గంటలలో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తాఆంధ్రకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్రం ప్రాంతాల మీద కొనసాగుతున్న అల్పపీడనం నకు అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వరకు 18°N Latitude వెంబడి 1.5 km నుంచి 2.1 km ఎత్తు మధ్య కొనసాగుతున్న ఉపరితల ద్రోణి బలహీనపడింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తాంధ్ర, యానాం :
ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, రేపు చాలాచోట్ల, ఎల్లుండి అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :
దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు కొన్నిచోట్ల, రేపు చాలాచోట్ల, ఎల్లుండి అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ :రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు ఒకటి లేక రెండుచోట్ల, రేపు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఎల్లుండి చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 17, 2020, 5:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading