Rain Alert : బంగాళాఖాతంలో.. అండమాన్‌కి దగ్గర్లో నిన్న అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ ఇది వాయుగుండగా మారి.. మరింత బలపడి.. తుఫానుగా మారొచ్చనే అంచనాలో ఉన్నారు వాతావరణ అధికారులు. ఐతే.. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల కంటే తమిళనాడు, పుదుచ్చేరిపై ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా చిన్నపాటి వర్షాలు కురుస్తాయనీ.. తెలంగాణ, ఒడిశాపై మబ్బులు ఉంటాయని చెబుతున్నారు.
ఓ అంచనా ప్రకారం అల్పపీడనం.. పశ్చిమ వాయవ్య దిశగా వెళ్లి.. 48 గంటల్లో తుఫానుగా మారుతుంది. అందువల్ల ఈనెల 8న తీరం దాటే అవకాశం ఉంది. అప్పుడే తమిళనాడు , పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తాయి.
అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రాత్రివేళ ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయి. అంటే చలి తీవ్రత తగ్గుతుంది. దీనికి కారణం ఆకాశంలో ఏర్పడే మేఘాలే. ఈ పరచుకున్న మేఘాల వల్ల.. భూమిలోని వేడి ఆవిరి.. ఆకాశంలోకి వెళ్లే అవకాశం ఉండదు. అందువల్ల వేడి.. భూ వాతావరణంలోనే ఉండిపోతుంది. అందువల్ల చల్లదనం తగ్గుతుంది. మళ్లీ పదో తేదీ నుంచి.. వాతావరణంలో చలి పెరగవచ్చని, మంచు బాగా కురుస్తుందని అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.