హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అలర్ట్.. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ అంతటా వర్షాలు..

అలర్ట్.. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ అంతటా వర్షాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో చెదురుమదురుగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

    వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో శుక్ర, శనివారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్త్రాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో చెదురుమదురుగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కోస్తాంధ్ర జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

    Published by:Anil
    First published:

    Tags: Andhra Pradesh, IMD, Rain alert

    ఉత్తమ కథలు