హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Love Marriage: కాలేజీలో ప్రేమ, పెళ్లి.., ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

Love Marriage: కాలేజీలో ప్రేమ, పెళ్లి.., ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

మళ్లీ కొద్దిగంటల తర్వాత ఫోన్ చేసి ఆ కానిస్టేబుల్ రావడం లేదనీ, అతడికి వేరే డ్యూటీ పడిందని చెప్పి మరొకరిని పంపిస్తున్నానన్నాడు. దీంతో అనుమానం వచ్చిన మురళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో మాకే మురళి, అతడికి సహకరించిన మాకే శంకర్ లను అరెస్ట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)

కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. తమను చంపేస్తామంటూ అమ్మాయి తల్లిదండ్రులు బెదిరిస్తున్నట్లు ప్రేమ జంట ఆరోపిస్తోంది.

  ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట పోలీసులను ఆశ్రయించింది. అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు మొరపెట్టుకుంది. తమతో పాటు తమ కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని పెనమలూరుకు చెందిన కీర్తి.. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దేవరకొండ తేజ కానూరు సిద్ధార్థ కాలేజీలో బీటెక్ చదువుకుంటున్నారు. కాలేజీలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. విషయం అమ్మాయి ఇంట్లో తెలిసి కట్టడి చేశారు. పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరూ పారిపోయి హైదరాబాద్ ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇద్దర్నీ చంపేస్తామని అమ్మాయి తల్లిదండ్రుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. వీరితో పాటు తేజ బావను కూడా చంపేస్తామని ఫోన్లో బెదిరిస్తున్నారని ప్రేమికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు రక్షణ కల్పించకుంటే చంపేస్తారని చెప్తున్నారు.

  ప్రేమికుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు..వారి ప్రేమ వ్యవహారం, పెళ్లి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇరువురి తల్లిదండ్రులకు కబురుపెట్టారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. కీర్తి ఇష్టప్రకారం ఎవరితో ఉంటానంటే వారితోనే ఆమెను పంపిస్తామని తెలిపారు.

  కీర్తి తల్లిదండ్రులు మాత్రం తేజ తమ కుమార్తెను కిడ్నాప్ చేసిశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆస్తి కోసమే తమ కుమార్తెను ట్రాప్ చేశాడని.., నిజంగా ప్రేమించి ఉంటే ఇంటి నుంచి డబ్బు, నగలు ఎందుకు ఎత్తుకెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Love marriage, Vijayawada

  ఉత్తమ కథలు