హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Lovers: తెల్లారితే పెళ్లి.. ఈలోపు ప్రియురాలి సడెన్ ఎంట్రీ.. చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్..!

Lovers: తెల్లారితే పెళ్లి.. ఈలోపు ప్రియురాలి సడెన్ ఎంట్రీ.. చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అనంతపురం (Anantapur) జిల్లా గుత్తి (Gooty) మండలం ఇసురాళ్లపల్లికి చెందిన రమేశ్‌కి పెద్దవడగూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. అన్నీ కార్యక్రమాలు, శుభలేఖల ఇవ్వడాలు, అమ్మాయి తరఫు.. అబ్బాయి తరఫు ఇచ్చి పుచ్చుకోవడాలు అన్నీ అయిపోయాయి ఇక బుధవారం తెల్లారితే పెళ్లి అనగా మంగళవారం రాత్రి వరుడికి పోలీస్ స్టేషన్‌ (Police Station) నుంచి ఫోన్ రావడంతో పెళ్లి పెటాకులయ్యింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Anantapur, India

ఈ మధ్య సినిమాటిక్ సన్నివేశాలు నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి. అఫ్‌కోర్స్ నిజ జీవితంలోవే సినిమాలో పెడతారనుకోండి. పెళ్లి (Marriage) విషయంలో మాత్రం ఆ లాస్ట్ సీన్ ఉంటుంది చూడండీ.. ఆ.. ఆ సీన్ ఈ మధ్య రిపీట్‌ల రిపీట్‌లు కొడుతుంది. పెళ్లిపీటల మీద పెళ్లికొడుకు (Bride), పెళ్లి కూతురు కూర్చుంటారు.. ఆఖరి నిమిషంలో ఆపండి అనే కేక. కట్ చేస్తే ప్రియుడు/ప్రియురాలి ఎంట్రీ. ఇలాంటివి ఇప్పుడు బాగా కామన్ అయిపోయాయి. సరిగ్గా ఇలాంటి ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. అయితే, పెళ్లి పీటల మీద కాదనుకోండి.. తెల్లారితే పెళ్లి అనగా ప్రియురాలి (Lover) సడెన్ ఎంట్రీతో మొత్తం సీన్ రివర్సయింది.

అనంతపురం జిల్లా గుత్తి మండలం ఇసురాళ్లపల్లికి చెందిన రమేశ్‌కి పెద్దవడగూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. అన్నీ కార్యక్రమాలు, శుభలేఖల ఇవ్వడాలు, అమ్మాయి తరఫు.. అబ్బాయి తరఫు ఇచ్చి పుచ్చుకోవడాలు అన్నీ అయిపోయాయి ఇక బుధవారం తెల్లారితే పెళ్లి అనగా మంగళవారం రాత్రి వరుడికి పోలీస్ స్టేషన్‌ నుంచి ఫోన్ రావడంతో పెళ్లి పెటాకులయ్యింది.

ఇదీ చదవండి: బాలయ్యా.. బావ బొమ్మేదయ్యా..! 'ఎన్టీఆర్ ఆరోగ్య రథం'పై కనిపించని చంద్రబాబు ఫొటో..


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఓ యువతి మంగళవారం రాత్రి గుత్తి పోలీసులను ఆశ్రయించింది. ఇసురాళ్లపల్లికి చెందిన రమేశ్ అనే అతను తనను ప్రేమించాడని.. ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడని ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు నేరుగా వరుడికి ఫోన్ చేసి వెంటనే పోలీస్ స్టేషన్‌కి రమ్మను కబురు పంపారు. దాంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న రమేశ్‌కి తాను ప్రేమించిన యువతిని చూడగానే కథంతా అర్థమయిపోయింది. దాంతో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, ప్రియురాలినే పెళ్లాడతానని చెప్పాడు.

ఇంతలో ఈ విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పంచాయితీ పెట్టారు. తెల్లారితే పెళ్లనగా ఇలా చేయడమేంటని.. ఇప్పుడు తమ బిడ్డ పరిస్థితి ఏంటంటి కాసేపు గందరగోళ వాతావరణం సృష్టించారు. వరుడు కుటుంబ సభ్యులు, పెళ్లి కుదర్చిన పెద్దలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తమను మోసం చేశారంటూ అదే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో ఒక కేసు పోయేటప్పటికీ వరుడికి ఇంకో కేసు తగులుకుంది. వధువు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వరుడు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గతంలో రాయలసీమ జిల్లాలో ఒక ఆడపిల్ల తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడిని చితకబాదిన సంఘటన మనలో చాలా మందికి గుర్తుండే ఉంటది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వధువు తాళి కట్టే సమయంలో తన లవర్ వస్తాడు ఆగు అంటూ పెళ్లి కొడుకుని పీటలపైనే ఆపిన సంఘటన అప్పట్లో పెద్ద సెన్షేషనే అయింది. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మరీ..!

First published:

Tags: Anantapuram, Love marriage, Lovers, Marriage

ఉత్తమ కథలు