ఆర్టీసీ బస్సు బోల్తా... 25 మందికి గాయాలు

ఆర్టీసీ బస్సు బోల్తా... 25 మందికి గాయాలు

ప్రతీకాత్మక చిత్రం

Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయా? రాత్రివేళ అతి వేగంతో బండ్లు నడపడం ప్రాణాలపైకి తెస్తోందా?

 • Share this:
  తూర్పుగోదావరి జిల్లా... కాకినాడ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అచ్చంపేట జంక్షన్ దగ్గర ఆర్టీసీ బస్సును వెనక నుంచీ వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అందరికీ కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన బస్సు... తూర్పు గోదావరి జిల్లాలోని... రాజోలు నుంచీ విశాఖ వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన బస్సు తుక్కు తుక్కైంది. లారీ ముందు భాగం కూడా తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

   

  Pics : వరైటీ వంటలతో వరల్డ్ ఫేమస్ అయిన రాచెల్ గోయెంకా
  ఇవి కూడా చదవండి :

  నేడు తేలనున్న మహారాష్ట్ర పంచాయతీ... సాయంత్రంలోపు కీలక ప్రకటన

  IND vs BAN | నేడే పింక్ బాల్ టెస్ట్... ఇవీ ప్రత్యేకతలు

  Health : నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా... డేంజరే.


  Health Tips : పియర్స్ తినండి... బరువు తగ్గండి... ఎన్నో ప్రయోజనాలు


  Health Tips : డయాబెటిస్‌కి వేపతో చెక్... ఇలా చెయ్యండి
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు