Andhra Pradesh: నడిరోడ్డుపై లారీ దగ్ధం.. బెంబేలెత్తిన జనం

ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) కృష్ణాజిల్లా (Krishna District)లో నడిరోడ్డుపై లారీ దగ్ధమైంది. డ్రైవర్ మంటలు వ్యాపించకుండా ఉండేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది.

news18-telugu
Updated: December 23, 2020, 10:32 PM IST
Andhra Pradesh: నడిరోడ్డుపై లారీ దగ్ధం.. బెంబేలెత్తిన జనం
మంటల్లో కాలిపోతున్న లారీ
  • Share this:
కృష్ణాజిల్లాలో నడిరోడ్డుపై లారి దగ్ధమైంది. విస్సన్నపేట సమీపంలోని ఓ రోడ్డుపై వరిగడ్డి లోడుతో వెళ్తున్న లారీకి విద్యుత్ తీగలు తగడలడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే భారీగా మంటలు చెలరేగి లారీకి అంటుకున్నాయి. ఐతే డ్రైవర్ మాత్రం లారీకి మంటలు అంటుకోకుండా ఉండేందుకు వేగంగా నడిపించాడు. దీంతో పక్కనే ఉన్న స్కూటీకి నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. లారీ మాత్రం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు మంటలార్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా లారీలో మంటలు రేగడంతో అక్కడున్నవారు బెంబేలెత్తిపోయారు.

మరో వైపు విశాఖలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు నడిరోడ్డు మీద తగలబడిపోయింది. ఉన్నట్టుండి కారులో నుంచి మంటలు రావడంతో అందులో ఉన్నవారు, చుట్టుపక్కల వారు భయాందోళనలకు గురయ్యారు. విశాఖలోని పాత గాజువాక పంతులగారి మేడ సమీపంలో ఈ ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు చెలరేగాయి. విశాఖ నుంచి కూర్మన్నపాలెం వెళ్లే మార్గంలో అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ కారు వద్దకు వెళ్లేందుకు అందరూ భయపడ్డారు. కారులో నుంచి మంటలు రావడం స్థానికులు ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు. ఇంజిన్‌లో నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడంతో దట్టమైన పొగ వ్యాపించింది. ఆ మార్గంలో వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఎప్పుడైనా పేలుతుందేమోనని ఆందోళన చెందారు. కొందరు మాత్రం ఈ మంటలను చూసి భయపడితే, మరికొందరు మాత్రం అక్కడ ఆగి వీడియోలు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొందరు స్థానికులే ముందుకొచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు.


తరచూ రోడ్లపై ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొన్నిసార్లు వాహనాల్లో ఉన్నవారు ప్రాణాలతో బయటపడుతున్నా.. కొన్నిసార్లు మాత్రం బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. రోడ్లపై వెళ్లటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Published by: Purna Chandra
First published: December 23, 2020, 9:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading