ఒకటి రెండు కాదు.. 132 లారీలు వరదలో చిక్కుకుపోయాయి. వెనక్కు వెళ్లలేక.. ముందుకు రాలేక భారీ వరదలో చిక్కుకుపోయాయి. ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి ఊహించని స్థాయిలో పెరిగింది. ఆ విషయం పై ముందస్తుగా ఎలాంటి హెచ్చరికలు లేకపోవడంతో.. నదిలో ఇసుక కోసం తెల్లవారు జామునే వందకు పైగా లారీలు వెళ్లాయి. ఎప్పటిలాగే ఇసుక తవ్వకాలు ప్రారంభించాలి అనుకున్నారు. కానీ ఆ లారీలన్నీ ఇప్పుడు వరదలో చిరక్కుకుపోయాయి. అకస్మాత్తుగా వరదతో రహదారి కూడా కొంతమేర దెబ్బతింది. దీంతో లారీలన్నీ తిరిగి వెనక్కి రాలేని పరిస్థితిలో అక్కడే నిలిచిపోయాయి. లారీ యజమానులు చెబుతున్నదాన్ని బట్టి దాదాపు 132 లారీలు వరదలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో లారీ డ్రైవర్లు, యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
సమాచారమందుకున్న పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలను ఏదో ఒక రకంగా ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు పడవల్లో ఒడ్డుకు చేర్చుతున్నారు.
ఇదీ చదవండి: స్కూల్లో జాయిన్ అవ్వాలంటే నాలుగు భాషాలు వచ్చి ఉండాలి.. షాక్ తింటున్న పేరెంట్స్
అయితే ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు లారీ యజమానులు. తహసీల్దార్ పై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సంఘటనా స్థలానికి ఆలస్యంగా వచ్చిన ఎమ్మార్వో పై లారీ డ్రైవర్లు మండిపడ్డారు. వరద విషయం తెలిస్తే.. ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి లారీలను కొనుగోలు చేశామని.. ఇప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా కారణంగా లారీలు వరద నీటిలో మునిగి పోతున్నాయని ఎమ్మార్వో ముందు గోడు వెళ్లబోసుకున్నారు లారీ యజమానులు.
వరద విషయం ముందుగా ఎందుకు చెప్పలేదని ఎమ్మార్వోని లారీ డ్రైవర్లు నిలదీశారు. అయితే తన వద్ద పూర్తి సమాచారం లేదని.. అంత పెద్ద వరద ఏమీ రాలేదని ఎమ్మార్వో సమాధానం చెబుతున్నారు. కానీ వందకుపైగా లారీలు చిక్కుకు పోవడం అనేది చిన్న విషయం కాదు.. వరధ ఉద్ధృతి మరింత పెరిగితే మనుషుల ప్రాణాలకు ముప్పువరు వాటిళ్లేది.. ప్రస్తుతం పడవల ద్వారా సురక్షితంగా తరలిస్తున్నారు కాని.. ఏదైనా జరిగితే ఎ కాదని పొంతనలేని సమాధానం ఎమ్మార్వో తప్పించుకునే ప్రయత్నం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Krishna District, Krishna floods