హంస వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి..

news18-telugu
Updated: October 11, 2018, 10:57 PM IST
హంస వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి..
  • Share this:
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన గురువారం రాత్రి స్వామి వారు సర్వ విద్యా ప్రదాయని అయిన శారదా మాత రూపంలో హంస వాహనంపై ఊరేగారు. పాలను నీళ్లను హంస వేరు చేసినట్టే గుణ గణాలను విచక్షణ జ్ఞానానికి సంకేతంగా హంస వాహనం అధిరోహిస్తారు. దీనికి తాత్వికంగా మరో అర్థం ఉంది. ఇహలోక బంధ విమకుడైనా జీవని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంస వాహనంపై పరమహంస అయినా శ్రీనివాసుడు ఊరేగడాన్ని చూసేందుకు భక్తులకు రెండు కళ్లు చాలలేదు.

హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే మరో మందిరమని కూడా అర్థం పరమాత్మ వేదోపదేశన్ని హంస రూపంలోనే చేసినందువల్ల తుచ్ఛమైన కోర్కెలనెడి అంధకారాన్ని వీడి, శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని ఈ వాహనం ద్వారా స్వామి వారు భక్తులకు చాటుతారని పురాణాలు చెబుతున్నాయి. హంసవాహనంపై మలయప్ప స్వామి తిరుమాడవీధుల్లో ఊరేగుతుండగా తిరుమల కొండలు గోవింద నామస్మరణలతో మార్మోగాయి.

First published: October 11, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading