• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • LORD SRI RAMA IDOL VANDALISED IN RAMATEERTHAM TEMPLE ANDHRA PRADESH VIZIANAGARAM SU

Andhra Pradesh: కోదాండ రామస్వామి ఆలయంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం

Andhra Pradesh: కోదాండ రామస్వామి ఆలయంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా పవిత్ర పుణ్య‌క్షేత్రం రామతీర్థంలోని కోదండ రామస్వామివారి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా పవిత్ర పుణ్య‌క్షేత్రం రామతీర్థంలోని కోదండ రామస్వామివారి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు విరగగొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. దేవస్థాన అర్చకుడు ప్రసాద్‌ రోజువారిలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు మంగళవారం ఉదయం పైకి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించి తోటి సిబ్బందికి సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వెనక ఎవరున్నారనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్‌ ఆలయం దిగువ ప్రాంతం వరకు వెళ్లి అక్కడున్న కోనేరు చుట్టూ తిరిగింది.

    అయితే దేవస్థానం వద్ద కాపలాదారు గానీ, విద్యుత్ సదుపాయం కానీ ఏర్పాటు చేయలేదు. మరోవైపు సీసీటీవీ కెమెరాలు కూడా లేకపోవడంతో నిందితులు ఎవరనేదానిని గుర్తించడం కష్టంగా మారింది. ఆలయ పరిసరాలను పరిశీలించిన నెల్లిమర్ల ఎమ్మెల్యే బి అప్పలనాయుడు, విజయనగరం ఎంపీ బి చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌‌రెడ్డి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు అప్రతిష్ఠను తెచ్చేందుకే కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపించారు.

    ఈ ఘటనపై దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తీవ్రంగా స్పందించి ఎస్పీ రాజకుమారితో మాట్లాడారు. దేవదాయ శాఖ ఆర్‌జేసీ డి.భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు. నిందితులను పట్టుకోవడం కోసం గాలింపు చేపడుతున్నట్టు ఎస్పీ రాజకుమారి తెలిపారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు