హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: కరోనా ఇక పోతుందంటున్న భక్తులు.. అందుకే శివయ్య కళ్లు తెరిచాడంటూ ప్రచారం

Andhra Pradesh: కరోనా ఇక పోతుందంటున్న భక్తులు.. అందుకే శివయ్య కళ్లు తెరిచాడంటూ ప్రచారం

కళ్లు తెరిచిన శివుడు

కళ్లు తెరిచిన శివుడు

శివయ్య నిజంగానే కళ్లు తెరిచాడా..? అసలు ఇది ఎలా సాధ్యమైంది..? ఈ ప్రచారంలో నిజమెంత..? ఈ ఘటన ఎక్కడ జరిగింది..?

అద్భుతం జరిగింది అంటున్నారు కొందరు భక్తులు.. ప్రస్తుతం యావత్ భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా భూతం ఇక వదిలిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనుషలను గజగజా వణికిస్తున్న కరోనా భూతాన్ని తరిమేయడానికి శివయ్య కళ్లు తెరిచాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ శివయ్య కళ్లు తెరిచింది ఎక్కడో తెలుసా.. అసలు ఏం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో.. టెక్కలి మండలం రావివలసలో స్వయంభూ శివలింగం ఉంది. ఆ స్వామిని స్థానిక ప్రజలు ఎంతో నమ్మకంతో కొలుస్తారు. స్వయంభూగా వెలిసిన శివుడికి మొక్కుకుంటే వెంటనే కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం.. అయితే నిన్న రాత్రి ఆ శివుడు కళ్లు తెరిచాడంటూ ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రాత్రి సమయంలో శివాలయానికి వెళ్లిన ఓ భక్తుడికి ఈ దృశ్యం కనిపించింది. దీంతో వెంటనే ఆలస్యం చేయకుండా తన మొబైల్ లో వీడియో తీసి షేర్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే దీనిపై ఆలయ అధికారులు మాత్రం ఇప్పటి వరకు స్పందించడం లేదు. స్థానికులు మాత్రం శివయ్య కళ్లు తెరిచారు అంటూ శుభం జరుగుతుందని.. కచ్చితంగా కరోనా అంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..

టెక్కలిలో శివయ్య కళ్లు తెరిచాడని ప్రచారం అవ్వడంతో భారీగా భక్తులు అక్కడికి చేరకున్నారు. శివనామస్మరణ చేస్తూ స్వామి వారిని అంతా దర్శించుకున్నారు. ఒక్కసారిగా భక్తులు పెద్ద సంఖ్యలో రావడంలో రావి వలసలో పూర్తి సందడి కనిపించింది.. అయితే ఇలా శివయ్య కళ్లు తెరిచాడు అంటూ దేశ వ్యాప్తంగా వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు వివిధ ప్రాంతాల్లో ప్రచారం జరుగుతూనే ఉంది.

ఐదు నెలల క్రితం అంటై ఫిబ్రవరిలో కర్ణాటకలోని శివుడు కళ్లు తెరిచాడంటూ వార్తలు హల్ చల్ చేశాయి. బెల్గాం జిల్లాలోని…చిక్కోడి నియోజకవర్గంలోని గోకాకలోని ఓ ఆలయంలో శివుడు కళ్లు తెరిచాడని ప్రచారం జరిగింది. దీంతో అది చాలా శుభపరిణామని ఆ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పూజారులు సైతం అంతా మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ శివలింగం కళ్లు తెరవటం ఇది మొదటిసారికాదని గతంలో కూడా శివలింగానికి ఉన్న కళ్లు తెరుచుకున్నాయని ఇదంతా మంచికేనంటూ భక్తులు ప్రత్యేక పూజలు కూడా చేశారు. 2004లో తొలిసారి ఇలా జరిగిందనీ..అలా జరిగిన తరువాత ప్రపంచానికి మేలు జరిగిందనీ… మళ్లీ అదే విధంగా జరిగింది కాబట్టి… మంచే జరుగుతుందని తెలిపారు. కానీ ఆ వెంటనే శివుడు కళ్లు మూసుకున్నాడని స్థానికులు చెబుతూ ఉంటారు. తాజాగా శ్రీకాకుళంలో శివుడు కళ్లు తెరిచాడంటూ ప్రచారం జరుగుతోంది..

First published:

Tags: Andhra Pradesh, AP News, Srikakulam