LORD GANESHA IN PAPAYA FRUIT AT EAST GODAVARI DISTRICT PHOTO GOES TO VIRAL NGS
Lord Ganesha: బొప్పాయి పండులో ఆకట్టుకుంటున్న బుల్లి గణపతి.. మండపం పెట్టి పూజిస్తున్న భక్తులు
బొప్పాయి పండులో బుల్లి వినాయకుడు
Lord Ganesha: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువమంది భక్తులు ఇష్టపడే దేవుడు వినాయకుడు.. కేవలం వినాయక నవరాత్రుల సమయంలోనే కాదు.. నిత్యం గణనాధుడ్ని కొలుస్తూ ఉంటారు. ఇటీవల ఏపీలో వింత వింత రూపాల్లో వినాయకుడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. దీంతో వారి ఆనందానికి హద్దులు ఉండడం లేదు.
Lord Ganesha: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వింత వింతలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వింత వినాయకుడు అందర్నీ అలరిస్తున్నాడు. బొప్పాయి (papaya) పండులో వినాయకుడి (Lord Ganesha) రూపం దర్శనమివ్వడంతో ఆ చుట్టు పక్కల ప్రజల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఈ వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే.. బొప్పాయి పండులో చెవులు రూపంలో వినాయకుడు వెలిశాడు అంటున్నారు. అందుకే పూజలు చేస్తున్నారు భక్తులు.. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఓ వింత వినాయకుడు దర్శన మిచ్చాడు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రజలు వినాయకుడ్ని చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నాయి.
బొప్పాయి పండులో గణేశుని రూపం స్పష్టంగా కనిపించడంతో ఆ భక్తుల ఆనందం రెట్టింపు అవుతోంది. దీంతో బొప్పాయి పండులోని గణపతికి పూజలను చేస్తూ.. ఇంట్లోని మండపంలో ఉంచారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బొప్పాయి పండులో అరుదైన వింత ఆకారం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన గంగాధర్ అనే బట్టల వ్యాపారి తినేందుకు కోనుగోలు చేసిన బోప్పాయి పండులో బుల్లి ఆకృతిలో బొజ్జగణపయ్య ప్రత్యక్షం అయింది. గంగాధర్ బోప్పాయి పండులోని గణపతిని చూసి అవాకై దైవంగా కొలిచి దండం పెట్టాడు. సాక్షాత్తు వినాయకుడే ఈ రూపంలో ప్రత్యక్షమై మా షాపుకి వచ్చాడని భావించి షాప్ లో ఉన్న దేవుళ్ళ చిత్రపటాల వద్ద పెట్టి పూజలు చేస్తూన్నాడు బట్టలవ్యాపారి గంగాధర్.
ఈవార్త ఆనోటా ఈ నోటా పాకడంతో.. బొప్పాయి లో బొజ్జ గణపయ్యను చూసెందుకు మహిళలు తరలి వస్తున్నారు. ఆ గణనాథుడు ఈవిధంగా ప్రత్యక్షమవ్వటం చాలా ఆనందంగా ఉందని గంగాధర్ చేపుతున్నాడు. చుట్టు పక్కల వారంతా కూడా వచ్చి గణపయ్య ఆకారాన్ని చూసి మురిసి పోతున్నారు.
విఘ్నేశ్వరుడిని పూజించడం వల్ల అడ్డంకులన్నీ తొలుగుతాయని, అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. వినాయక చవితి మొదలుపెట్టి.. ప్రతీ పూజలోనూ మొదట వినాయకుడిని పూజించి పూజను ఆరంభిస్తుంటాం. రకరకాల ఆకారాలలో వినాయకుడిని తయారు చేసి పూజలు చేయడం, పూజగదిలో ప్రతిష్టించి ఆయనకు ప్రత్యేక పూజలు కూడా చేస్తాం. వినాయక చవితి రోజున వాడవాడలా మండపాలలో రకరకాల అవతారాలలో వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తుంటాం. ఇప్పుడు నేరుగా తమ ఇంటికి వినాయకుడు బొప్పాయి పండు రూపంలో రావడంతో ఆ భక్తుడి ఆనందం రెట్టింపు అవుతోంది.
ఇదీ చదవండి వైసీపీ పాలనపై RRR మూవీ సాంగ్ తో పేరడీ.. వైరల్ గా మారిన ట్వీట్
వినాయకుడు.. మన పై కనికరం తో గ్రామంలోకి వచ్చాడని భావించి బొప్పాయి పండుకు పూజలు చేస్తున్నారు చుట్టు పక్కల ప్రజలు.. వినయాకుడు ఇలా దర్శనమివ్వడం శుభశుచికమని.. ఇక తమకు అంతా మంచే జరుగుతుందని వారు నమ్ముతున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.