హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

లైవ్‌లో చంద్రబాబు.. మధ్యలో వచ్చి షాకిచ్చిన దేవాన్ష్.. వీడియో వైరల్

లైవ్‌లో చంద్రబాబు.. మధ్యలో వచ్చి షాకిచ్చిన దేవాన్ష్.. వీడియో వైరల్

లైవ్‌లో చంద్రబాబు.. మధ్యలో వచ్చి షాకిచ్చిన దేవాన్ష్.. వీడియో వైరల్

లైవ్‌లో చంద్రబాబు.. మధ్యలో వచ్చి షాకిచ్చిన దేవాన్ష్.. వీడియో వైరల్

దేవాన్ష్ చేసిన పనికి నెటిజన్లు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. అంత చిన్న వయసులోనూ ఎంత క్రమశిక్షణ.. తాత ప్రెస్‌మీట్‌ను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాడని మెచ్చుకుంటున్నారు.

  కరోనా కష్టకాలంలో చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. విద్యార్థులు కూడా ఆన్‌లైన్‌లోనే క్లాసులు వింటున్నారు. ఇక రాజకీయ నాయకులది కూడా అదే పరిస్థితి. గతంలో సభలు సమావేశాలతో పాటు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు. కానీ ఇప్పుడంత సీన్ లేదు. ఎవరిళ్లల్లో వారు కూర్చొని జూమ్, గూగుల్ మీట్, జియో మీట్ యాప్స్ ద్వారా ప్రెస్‌మీట్ పెడుతున్నారు. పెద్ద పెద్ద సమావేశాలకు కూడా ఇప్పుడివే దిక్కు. ఐతే ఇంట్లో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ ముందు కూర్చొని మాట్లాడుతున్న సమయంలో అప్పుడప్పుడూ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. లైవ్ మధ్యలో పిల్లలు రావడమో.. ఏవండీ అంటూ సతీమణి రావడమో.. జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయింది.

  శుక్రవారం సాయంత్రం జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రెస్‌మీట్ నిర్వహించారు. అమరావతి అంశంపై మాట్లాడిన ఆయన జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐతే చంద్రబాబు లైవ్‌లో మాట్లాడుతున్న విషయం తెలియక.. మనవడు దేవాన్స్ పుస్తకాల కోసం వచ్చాడు. చంద్రబాబు వెనకాలే బుక్ షెల్ఫ్ ఉంది. ఆ పుస్తకాలను తీసుకునేందుకు వచ్చిన దేవాన్ష్ జూమ్ లైవ్ ఫ్రేమ్‌లో కనిపించాడు. వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి.. ఇది లైవ్ అని చెప్పడంతో, దేవాన్ష్ కిందకు వంగి బుక్ షెల్ఫ్‌లో తనకు కావాల్సిన పుస్తకం తీసుకున్నాడు. ఆ తర్వాత లైవ్‌లో కనిపించకుండా ఉండేందుకు, నెమ్మదిగా కింది నుంచే వెళ్లిపోయాడు దేవాన్ష్. అదంతా జూమ్‌ లైవ్‌లో రికార్డయింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


  ఈ వీడియోను చూసిన నెటిజన్లు దేవాన్ష్ చేసిన పనికి ముసిముసిగా నవ్వుకుంటున్నారు. అంత చిన్న వయసులోనూ ఎంత క్రమశిక్షణ.. తాత ప్రెస్‌మీట్‌ను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాడని మెచ్చుకుంటున్నారు. ఐతే దేవాన్ష్ 'అక్బర్ బీర్బల్' తెలుగు కథల పుస్తకం కోసం వచ్చినట్లుగా తెలుస్తోంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News

  ఉత్తమ కథలు