నరేంద్ర మోదీ, చంద్రబాబు ట్వీట్ల వార్... ఎవరూ వెనక్కి తగ్గట్లేదుగా...

Lok Sabha Elections 2019 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలో ప్రచారానికి వస్తున్న తరుణంలో... ట్విట్టర్‌లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 1, 2019, 12:42 PM IST
నరేంద్ర మోదీ, చంద్రబాబు ట్వీట్ల వార్... ఎవరూ వెనక్కి తగ్గట్లేదుగా...
చంద్రబాబు, నరేంద్ర మోదీ
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ రాజమహేంద్రవరానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ అధినేత చంద్రబాబు... ఆదివారం ఎన్నికల ప్రచారంలో భగ్గుమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని మోదీ... ఏ మొహం పెట్టుకొని రాజమహేంద్రవరం వస్తారని మండిపడ్డారు. బీజేపీకి ఒక్క ఓటు కూడా పడదని ఛాలెంజ్ విసిరారు. దీనిపై ప్రధాని మోదీ ట్విట్టర్‌లో అచ్చ తెలుగులో సమాధానం ఇచ్చారు. ఏపీలో ఈసారి టీడీపీ ఓడిపోతుంది అన్నారు. తద్వారా నరేంద్ర మోదీ... డైరెక్టుగా చంద్రబాబును టార్గెట్ చేసినట్లైంది. ఇంత ఘాటుగా స్పందించిన మోదీ... రాజమండ్రి సభలో మరోసారి చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ను మరోసారి టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మోదీ ట్వీట్‌పై చంద్రబాబు కూడా ఘాటుగా కౌంటరిచ్చారు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారనీ, ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నల్లధనాన్ని విదేశాలనుంచీ వెనక్కు తెస్తామని హామీలు ఇచ్చి, ఆర్థిక నేరస్తులతో అంటకాగుతూ, బ్యాంకుల్ని దోచిన వారిని దేశాన్ని దాటిస్తూ, లక్ష కోట్ల ప్రజాధనాన్ని ఎత్తుకుపోయిన వారికి అభయమిస్తూ, ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతిని వ్యవస్థీకరిస్తున్న మోదీకి అవినీతిపై మాట్లాడటం అసహ్యంగా లేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికీ, తీరని ద్రోహం చేసిన మోదీ దుర్మార్గపు పరిపాలనకు, త్వరలోనే ముగింపు పలకాలని దేశ ప్రజలు-రాష్ట్ర ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారన్న చంద్రబాబు... ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్రంలో అధికార మార్పును బలంగా కోరుకుంటున్నారని ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు.నరేంద్ర మోదీతో జట్టుకట్టారని ఆరోపిస్తున్న వైఎస్ జగన్‌పైనా చంద్రబాబు విరుచుకుపడ్డారు. జగన్ డర్టీ పాలిటిక్స్ నడిపిస్తున్నాడన్న ఆయన... ప్రజలు టీడీపీతోనే ఉన్నారని అన్నారు. ఎన్నో సమస్యలు ఉన్నా... టీడీపీ ప్రజల కోసం ఎంతో చేసిందన్న చంద్రబాబు... విభజన సమస్యలు అలాగే ఉన్నాయనీ, ప్రత్యేక హోదా ఇవ్వలేదనీ, అయినప్పటికీ చాలా చక్కటి పరిపాలన ఇచ్చామని అన్నారు. ఎన్నికలు వన్ సైడ్‌గా జరుగుతాయన్నారు.

 

ఇవి కూడా చదవండి :

వాయనాడ్‌లో రాహుల్ గెలుపు నల్లేరుపై నడకేనా... లెఫ్ట్ పార్టీలు పోటీ నుంచీ తప్పుకునే అవకాశం...

ఏపీలో పెరిగిన బెట్టింగుల జోరు... వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ...

వైసీపీలో చేరిన రాజశేఖర్, జీవిత... టీడీపీ, జనసేన తోడుదొంగలు అంటూ ఫైర్...
First published: April 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>