• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • LOK SABHA ELECTIONS 2019 K A PAUL SUBMITTED NOMINATION PAPERS WITH HALF FILLING NK

ఇవేం నామినేషన్ పత్రాలు నాయనో... కే ఏ పాల్ పేపర్లు చూసి తలలు పట్టుకుంటున్న అధికారులు...

ఇవేం నామినేషన్ పత్రాలు నాయనో... కే ఏ పాల్ పేపర్లు చూసి తలలు పట్టుకుంటున్న అధికారులు...

కే ఏ పాల్ (File)

Lok Sabha Elections 2019 : కే ఏ పాల్ సమర్పించిన నామినేషన్ పత్రాల్లో సగం వివరాలే ఉండటంతో అధికారులకు ఇబ్బందిగా మారింది. తనకున్న ఆస్తులు రూ.30 వేలే అనడంతో అధికారులు షాకయ్యారు.

  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ఔనన్నా, కాదన్నా... అందరి నోళ్లలో నానే చర్చనీయాంశమైన పేరు కే ఏ పాల్. మంచిగానో, చెడుగానో, సీరియస్ గానో, సిల్లీగానో... ప్రతి రోజూ ఆయన మీడియాలో, సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. మనం సీరియస్ అంశాన్ని మాట్లాడుకుందాం. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన కిలారి ఆనంద్ పాల్... నర్సాపురం నియోజకవర్గం నుంచీ లోక్ సభకు పోటీ చేస్తున్నారు. మిగతా అభ్యర్థుల లాగే ఆయన కూడా తన నామినేషన్ పత్రాల్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సాధారణంగా నామినేషన్ పత్రాల్లో అన్ని వివరాల్నీ పూర్తి చెయ్యాల్సిందే. అక్కడ ఆప్షన్ ఉండదు. తమకు సంబంధం లేని అంశాలేవైనా ఉంటే, అక్కడ నాట్ అప్లైకబుల్ (NA) అని అయినా రాయాలి. కానీ పాల్ ఇచ్చిన పేపర్లలో దాదాపు సగం ఆప్షన్లు ఖాళీగానే ఉన్నాయి. అలా ఇస్తే కుదరదు. నామినేషన్‌ను తిరస్కరించే ప్రమాదం ఉంది. మరి పాల్ ఎందుకు అంత నిర్లక్ష్యంగా నామినేషన్ వేశారన్నదానిపై కొత్త చర్చ జరుగుతోంది.

ఎంత ఆశ్చర్యకరమంటే... నామినేషన్ పత్రాలపై పాల్ తన ఫొటో కూడా అతికించలేదు. ఎంత వరకూ చదువుకున్నదీ రాయలేదు. ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీలు మాత్రం వేశారు. తన అసలు పేరు కిలారి ఆనంద్ అని అందులో చెప్పిన పాల్... విశాఖపట్టణంలోని న్యూ రైల్వే కాలనీలో ఉన్న తన ఇంటి అడ్రస్ ఇచ్చారు. తన వయసు 55 ఏళ్లు అని రాశారు. కులం, మతం వివరాలేవీ లేవు. (NA అని కూడా రాయలేదు) తన నామినేషన్‌కు సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల పేర్లు కూడా రాయలేదు. పాన్ కార్డు నంబరు ఇచ్చారు గానీ... ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు. ఈ కారణాలు చాలు ఆయన నామినేషన్‌ను రిజెక్ట్ చెయ్యడానికి.


తనపై ఒంగోలులో ఓ కేసు ఉందని రాసిన పాల్... క్రిమినల్ కేసులు ఏవీ లేవని అన్నారు. ఫెడరల్ బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చారు. చిత్రమేంటంటే తన మత పరమైన మీటింగ్ లకు వందల కోట్ల రూపాయలు వచ్చి పడేవని చెప్తున్న పాల్... ప్రస్తుతం తన దగ్గర రూ.30 వేలు మాత్రమే ఉన్నాయన్నారు. తనకు ఎలాంటి ఆస్తులూ, అప్పులూ లేవన్నారు. ఈ విషయాన్ని అధికారులు నమ్మలేకపోతున్నారట. నామినేషన్‌లో చెప్పిన వాటిలో ఏవి నిజం, ఏవి అబద్ధమన్నది అంతుబట్టక తలలు పట్టుకుంటున్నారట. నామినేషన్‌ను తిరస్కరిస్తే, పాల్ ఎలా ఫీలవుతారోనని ఆలోచిస్తున్నారని సమాచారం. వెనక్కి ఇచ్చి, పూర్తి వివరాలు ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి :

దక్షిణ బెంగళూరుకు అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్... ప్రధాని మోదీ దక్షిణ బెంగళూరుకు పోటీ చేస్తారా?

దక్షిణాదిపై జాతీయ పార్టీల చూపు... సీట్లు పెంచుకోవడమే లక్ష్యం... అధినేతలు సౌత్‌లో పోటీ చేస్తారా

సైలెంట్‌గా విజృంభిస్తున్న టీబీ... క్షయ వ్యాధి లక్షణాలేంటి... రాకుండా ఏం చెయ్యాలి

ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు... అవేంటో తెలిస్తే, తొక్కలు అస్సలు పారేయరు...
First published: