దగ్గరవుతున్న బీజేపీ, వైసీపీ ... ఫలితాల తర్వాత పొత్తు..? ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా.. ?

Lok Sabha Election 2019 : బీజేపీ, వైసీపీ మధ్య అనధికారిక పొత్తు ఉందన్నది విశ్లేషకుల మాట. ఎన్నికల తర్వాత అది అధికారికం కాబోతోందా...

Krishna Kumar N | news18-telugu
Updated: May 8, 2019, 7:43 AM IST
దగ్గరవుతున్న బీజేపీ, వైసీపీ ... ఫలితాల తర్వాత పొత్తు..? ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా.. ?
చంద్రబాబు, నరేంద్ర మోదీ, వైఎస్ జగన్
  • Share this:
కేంద్రంలో ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి తమ మద్దతు ఉంటుందని తెగేసి చెప్పారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఐతే... కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు, ఒకవేళ బీజేపీ యేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఉంటే, అప్పుడు వైసీపీ ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందా అన్నది తేలాల్సిన అంశం. ఐతే... ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా... వైసీపీ, బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధమవుతోందన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఆల్రెడీ ఆ రెండు పార్టీల మధ్యా అనధికారిక పొత్తు ఉందనీ, ఎన్నికల తర్వాత అది వాస్తవ రూపు దిద్దుకుంటుందనే ప్రచారం సాగుతోంది. 23న ఎన్నికల ఫలితాలు రాగానే... బీజేపీతో పొత్తు దిశగా వైసీపీ వేగంగా అడుగులు వేస్తుందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. అదే నిజమైతే... ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి బీజేపీ అటకెక్కించే అవకాశాలుంటాయి. ప్రత్యేక హోదా ఇచ్చేటట్లైతేనే మద్దతు ఇస్తామని వైసీపీ కండీషన్ పెడితే మాత్రం... బీజేపీ తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా జరగాలంటే... ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి రావాలి. ఒకవేళ వైసీపీ ప్రతిపక్షంగా ఉండి, కేంద్రంలో బీజేపీకి మద్దతిస్తే, అప్పుడు బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చినా, ఆ క్రెడిట్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దక్కే అవకాశాలుంటాయి. ఇలా ప్రత్యేక హోదా అంశం రాజకీయ ఎత్తుగడలకు కేంద్రం కాబోతోంది.

వైసీపీ అధినేత జగన్ బీజేపీవైపు మళ్లుతుండటానికి ప్రధానకారణం టీడీపీయే. ఆ పార్టీ ఇప్పటికే బీజేపీయేతర శక్తులను ఒక్కచోటికి చేర్చుతోంది. అందువల్ల టీడీపీ కచ్చితంగా బీజేపీయేతర కూటమిలో భాగస్వామ్యపార్టీగా ఉంటుంది. అలాంటప్పుడు జగన్... ఆ కూటమిలో చేరే అవకాశాలు, దానికి మద్దతిచ్చే పరిస్థితులూ ఉండవు. అందువల్ల జగన్... కచ్చితంగా బీజేపీకే సపోర్ట్ చేస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటికే ప్రతీ అంశంలో టీడీపీ, వైసీపీ మధ్య పూర్తి భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. ఎన్నికలు సరిగా జరగలేదని టీడీపీ అంటే, బాగా జరిగాయని వైసీపీ చెప్పింది. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పులపై టీడీపీ ఆందోళనలు చేస్తుంటే, వైసీపీ వాటిని ఖండిస్తోంది. ఎన్నికల సంఘం పనితీరు, ఏపీలో ప్రధాన కార్యదర్శి (CS) సమీక్షలపై టీడీపీ అభ్యంతరాలు చెబుతుంటే, వైసీపీ అడ్డుకుంటోంది. ఇలా రెండు పార్టీలూ పూర్తి విరుద్ధమైన మార్గాల్లో వెళ్తున్నాయి. అందువల్ల కేంద్రంలో మద్దతు విషయంలోనూ రెండు పార్టీలూ పూర్తి భిన్నంగా స్పందించే అవకాశాలున్నాయి.

అంతా వ్యూహాత్మకమేనా : ఏపీ ఎన్నికలకు ముందు బీజేపీతో తమకు ఎలాంటి పొత్తూ లేదని వైసీపీ చెబుతూ వచ్చింది. తద్వారా మైనార్టీ, ముస్లిం, దళిత ఓట్లు చేజారకుండా జాగ్రత్తపడింది. ఎన్నికల తర్వాత మాత్రం వ్యూహం మార్చిందనీ, బీజేపీకి పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో వైసీపీ 120 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. అలాగే కేంద్రంలో మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఆ క్రమంలో వైసీపీ మద్దతు తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. అంతా ఆ పార్టీ నేతలు అనుకున్నట్లే జరిగితే... ప్రత్యేక హోదా అంశం అటకెక్కుతుందా, అమలవుతుందా అన్నది తేలాల్సిన అంశం.

 

ఇవి కూడా చదవండి :

నేడు పశ్చిమ బెంగాల్‌కి చంద్రబాబు... మమతా బెనర్జీకి మద్దతుగా రెండ్రోజులు ప్రచారం

చంద్రబాబు ప్రధాని అవ్వగలరా...? ఉండవల్లి వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటి ?

సహజీవనం పెళ్లితో సమానం... రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు...
First published: May 8, 2019, 7:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading