అప్పుడు అన్న చిరంజీవి... ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్... ఎందుకిలా చేశారు...

AP Assembly Election 2019 : క్యూలో నిలబడకుండా ఓటు వేయబోయి ఒకప్పుడు చిరంజీవి చిక్కుల్లో పడితే... ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: April 11, 2019, 11:52 AM IST
అప్పుడు అన్న చిరంజీవి... ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్... ఎందుకిలా చేశారు...
పవన్ కళ్యాణ్, చిరంజీవి (Chiranjeevi pawan Kalyan)
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్... విజయవాడలో ఓటు వేసేందుకు వచ్చి క్యూ పద్ధతి పాటించకుండా... తిన్నగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లిపోయారనీ, తమను తోసుకుంటూ ముందుకు వెళ్లిపోవడం సమంజసం కాదనీ తోటి ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అభ్యర్థిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ కనీస మర్యాదలూ, రూల్సూ పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ ఆరోపణలను జనసేన కార్యకర్తలు తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ ఓటు వేసేందుకు వచ్చినప్పుడు చాలా మంది ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారనీ, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందనే ఉద్దేశంతో ఆయన హడావుడిగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిపోయారని అంటున్నారు. అంతేతప్ప పవన్ కళ్యాణ్‌కి రూల్స్ అతిక్రమించే ఆలోచన లేదంటున్నారు.2014లో సరిగ్గా ఇలాగే చేయబోయారు మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన... జూబ్లీహిల్స్‌లో ఓటు వేసేందుకు కుటుంబ సభ్యులతో వచ్చారు. మంత్రి హోదాలో ఉన్న ఆయన్ను ఓటు వేసేందుకు రావాలని కొందరు పిలవడంతో చిరంజీవి క్యూలో నిలబడకుండా తిన్నగా ముందుకు వెళ్లిపోతుంటే... ఎన్నారై సాఫ్ట్‌వేర్ కుర్రాడు కార్తీక్ అడ్డుకున్నాడు. మీరు అలా వెళ్లిపోతుంటే... క్యూలో ఉన్న మేమంతా పిచ్చోళ్లమా అంటూ గట్టిగానే ప్రశ్నించాడు. ఓవైపు తాను చిరంజీవి అభిమానిని అంటూనే... అదే మెగాస్టార్‌పై ఇంతెత్తున మండిపడ్డాడు. ఆ క్షణంలో చిరంజీవి సహనంతో వెనక్కి తగ్గారు. క్యూలో నిలబడి ఓటు వేశారు. అప్పటి నుంచీ ఆయన ఎప్పుడు ఓటు వేసినా క్యూలోనే వెళ్తున్నారు. ఇవాళ కూడా ఆయన కుటుంబ సభ్యులతో క్యూలోనే నిలబడి ఓటు వేశారు.
Phase 1 of voting, polling for 91 seats, lok sabha election 2019, lok sabha elections 2019, lok sabha polls 2019, First phase dates election, first phase of election 2019, General Elections 2019, 2019 Lok Sabha Election Polling day, india lok sabha election 2019, lok sabha elections 2019 live updates, Telugu Desam Party, Saharanpur, Red Alert Constituency in first phase, Andhra and Arunachal Pradesh, Chhattisgarh, Jammu and Kashmir Election News, voting status, Elections Breaking news, Election updates, andhra pradesh polling updates, telangana polling updates, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు, పోలింగ్ డే లైవ్ న్యూస్, ఓటింగ్, పోలింగ్,
2014లో చిరంజీవిని అడ్డుకున్న యువకుడు


అప్పుడు చిరంజీవి చేసినట్లే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ఎన్నికల్లో అందరూ సమానమేననే విషయాన్ని సెలబ్రిటీలు దృష్టిలో పెట్టుకుంటే, సామాన్యులకు మేలు చేసినట్లవుతుంది అంటున్నారు విశ్లేషకులు.
First published: April 11, 2019, 11:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading