కడప జిల్లా ఎర్రగుంట మండలంలోని పొట్లదుర్తిలో వైసీపీ ఏజెంట్, టీడీపీ నేత సీఎం రమేష్ మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం రమేష్ పోలింగ్ స్టోషన్ లోకి వెళ్తుండగా... వైసీపీ ఏజెంట్ అడ్డుకోవడంతో గొడవ జరిగింది. తనపై వైసీపీ ఏజెంట్ చేయి చేసుకున్నారంటూ పోలింగ్ స్టేషన్ ముందు భైటాయించారు సీఎం రమేష్. ఆయన మద్దతు దారులు ఆయనకు అండగా ఉండటంతో... పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలింగ్‌కి అంతరాయం ఏర్పడుతోందంటూ ఎన్నికల అధికారులు రెండు వర్గాల వారినీ శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఐతే... సీఎం రమేష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. వైసీపీ కావాలని కుట్రలు పన్నుతోందని ఫైర్ అయ్యారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.