హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కొనసాగుతున్న మాక్ పోలింగ్... కొన్నిచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు, వీవీప్యాట్లు...

కొనసాగుతున్న మాక్ పోలింగ్... కొన్నిచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు, వీవీప్యాట్లు...

(ఫైల్ ఫోటో)

(ఫైల్ ఫోటో)

Lok Sabha Election 2019 : ఏపీ వ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్న సమస్య కనిపిస్తోంది. ఇదే కంటిన్యూ అయితే... పోలింగ్ ఈవెనింగ్ 6లోపు కంప్లీట్ అవ్వడం కష్టమంటున్నారు అధికారులు.

Lok Sabha Election 2019 : ఎన్నికలకు సంబంధించి మాక్ పోలింగ్ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిగా పనిచెయ్యట్లేదు. బటన్ నొక్కితే బీప్ సౌండ్ రావట్లేదు. కొన్నిచోట్ల మాక్ పోలింగ్‌లో ఓటు వేస్తే, వీవీప్యాట్‌లో స్లిప్ కనిపించట్లేదు. ఇలాగేతే ఇబ్బందే అనుకుంటున్నారు అధికారులు. గుంటూరు జిల్లాలో ఈవీఎంలు, వీవీప్యాట్లు సరిగా పని చేయట్లేదని తెలిసింది. అక్కడ కొన్ని చోట్ల మాక్ పోలింగ్ మొదలవ్వలేదు. కొన్ని చోట్ల మాత్రం అభ్యర్థుల ఏజెంట్లకు ఈవీఎంలు, వీవీప్యాట్లపై పోలింగ్ సిబ్బంది అవగాహన కలిగిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్న సమస్య కనిపిస్తోంది. ఇదే కంటిన్యూ అయితే... పోలింగ్ ఈవెనింగ్ 6లోపు కంప్లీట్ అవ్వడం కష్టమంటున్నారు అధికారులు.

లోకసభ, పార్లమెంట్ సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి... ఎవరైనా ఫిర్యాదులు, సమస్యలు చెప్పాలనుకుంటే 24 గంటలూ పనిచేసేలా 08672-252176, 252377 ఫోన్ నంబర్లతో కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటైంది.

First published:

Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Telangana Lok Sabha Elections 2019

ఉత్తమ కథలు